నకిలీ పాస్ పుస్తకాల కేసులో ఇద్దరి అరెస్ట్
-
పరారీలో వీఆర్వో, అటెండర్
కొడకండ్ల : నకిలీ పాస్ పుస్తకాల తయారీ కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎంబాడి సత్యనారాయణ తెలి పారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వీఆర్వో, తహసీల్దార్ కార్యాలయ అటెండర్ పరారీలో ఉన్నారని చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. కొడకండ్ల శివారు దుబ్బతండాకు చెందిన ధరావత్ భీమానాయక్ మండలంలోని వివిధ గ్రామాల రైతుల పేరిట కంప్యూటర్ పహాణీల మోటేషన్, కరెక్షన్‌ల కోసం రెవెన్యూ కార్యాలయంలో 41 దరఖాస్తులు అందజేశాడు. వీటిపై ఇన్‌చార్జ్ తహసీల్దార్ రాములునాయక్, సీనియర్ అసిస్టెంట్ దేవానాయక్, రామవరం వీఆర్వో కనకరాజు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టగా భూములు లేని వారి పేరిట కూడా దరఖాస్తులు ఉన్నట్లు తెలిసిం ది. ఇవి నకిలీ పాస్‌పుస్తకాలుగా అనుమానించిన తహసీల్దార్ ఈనెల 18న పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యా దు చేశారు. ఎస్సై విచారణ చేపట్టగా 41 దరఖాస్తుల్లో 18 మందికి మాత్రమే భూములున్నట్లు తేలింది. ధరావత్ భీమానాయక్, భానోత్ యా కూబ్ పాస్ పుస్తకాలు చేయిస్తామని చెప్పి అమాయక రైతుల నుండి డబ్బులు తీసుకున్నారు.
సద రు రైతులు తమ పని ఏమైందని అడగగా, వారి ద్దరూ కొడకండ్ల, పోచంపెల్లి వీఆర్వో దోకూరు సైదులును ఆశ్రయించారు. ఒక్కోదానికి రూ.3 వేల చొప్పున రూ.54 వేలు తీసుకున్న సైదులు వారికి 18 పాస్ పుస్తకాలను అందించాడు. ఈ పుస్తకాల్లో రైతుల వివరాలను భీమానాయక్ రాయగా, తహసీల్దార్, ఆర్డీఓ ఫోర్జరీ సంతకాలను యాకూబ్ చేశాడు. తహసీల్దార్ కార్యాలయ అటెండర్ ఎద్దు మల్లయ్య ఒక్కో పుస్తకానికి రూ.300 చొప్పున తీసుకొని తహసీల్దార్, కార్యాలయ ముద్రలు వేశాడు. అయితే ఈ పుస్తకాలలో రైతుల పేర్లు, ఊరి పేర్లు మార్చి మోటేషన్, కరెక్షన్‌ల కోసం భీమానాయక్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్ పుస్తకాలన్నీ 2012లో అప్పటి తహసీల్దార్ ప్రభాకర్‌రావు ఫోర్జరీ సంతకాలతో రూపొందించినట్లు ఎస్సై తెలిపారు. నింది తుల నుంచి 18 పాస్ పుస్తకాలు, తహసీల్దార్ కార్యాలయ ముద్రలను స్వాధీనం చేసుకొని, వారిపై 420, 468,471 ఐపీసీ సెక్షన్‌ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని వివరించారు.
దళారులను నమ్మి మోసపోవద్దు..
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్సై సూచించారు. ఈ ముఠాకు డబ్బులిచ్చిన వారు ఇంకెవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇప్పటికే పాస్ పుస్తకాలు చేయించుకున్న వారు అవి సరైనవా కాదా అని తహసీల్దార్ కార్యాలయం లో పరి శీలించుకోవాలన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నకిలీ పుస్తకాలతో బ్యాంకు రుణాలు పొందిన వారి జాబితా తీసుకొని విచారణ చేపడతామని, ఫోర్జరీ సంతకాలను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపుతామని తెలిపారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేయడంలో ఏఎస్సై కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్ శంకర్, పీసీలు విద్యాసాగర్, సురేష్ కృషి చేశారని చెప్పారు.