
బాబు ప్రకటన వల్లే ఈ దుస్థితి: ఉమ్మారెడ్డి
హైదరాబాద్: కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం హైదరాబాద్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా డెల్టాకు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మిన రైతులు పంటలు వేశారని, అయితే నీళ్లు లేక పంటలు ఎండిపోయాయన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు.