నిరుద్యోగులకు ‘ఆన్‌లైన్‌’ కష్టాలు | Unemployed 'online' Difficulties | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ‘ఆన్‌లైన్‌’ కష్టాలు

Published Sat, Dec 24 2016 1:10 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నిరుద్యోగులకు ‘ఆన్‌లైన్‌’ కష్టాలు - Sakshi

నిరుద్యోగులకు ‘ఆన్‌లైన్‌’ కష్టాలు

  •  29, 30 తేదీల్లో ఏఈఈ పోస్టుల భర్తీకి పరీక్ష
  • ఇచ్చిన ఆప్షన్లు కాకుండా గుంటూరు జిల్లాలో పరీక్ష కేంద్రాలు
  • ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు
  •  

    ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈ నెల 29, 30 తేదీల్లో  ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని వందలాది మంది అభ్యర్థులకు  గుంటూరు జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు.  ఇక్కడి నుంచి 400 కిలోమీటర్ల దూరమున్న గుంటూరుకు వెళ్లాలంటే అధిక ఖర్చు భరించాల్సి వస్తోంది. దీనికి తోడు రెండు రోజులు అక్కడే ఉండాల్సి ఉంది. ముఖ్య మహిళా అభ్యర్థులు కుటుంబ సభ్యులను వెంట తీసుకొని పోవాల్సి ఉంటోంది. దీంతో ఈ ఖర్చు రెండింతలు అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కరెన్సీ కష్టాల నేపథ్యంలో అంతదూరం వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలకు కూడుకున్నదంటూ అభ్యర్థులు వాపోతున్నారు.

     

     అప్షన్‌ ఇచ్చినది ఒకటి...  కేటాయింపు మరొకటి..

     జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను  అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌కడప ఆప్షన్‌ ఇచ్చుకున్నారు.   వీటిని పరిగణలోకి తీసుకోకుండా  గుంటూరు  జిల్లాలో కేంద్రాలు కేటాయించడం గమనార్హం. అనంత జిల్లాలో ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల, వీ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాలకు 350 మంది అభ్యర్థులను కేటాయించారు. వీటితో పాటు జిల్లాలో పీవీకేకే, శ్రీసాయి, ఎస్వీఐటీ, ఇంటెల్, మౌలాలి, అనంతలక్ష్మీ ఇంజనీరింగ్‌ కళాశాలలతో పాటు ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలోనూ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వసతులున్నాయి. కానీ మిగిలిన అభ్యర్థులను గుంటూరు  కేంద్రాలకు కేటాయించారు.

     

    అధికారుల నిర్లక్ష్యం...

    అధికారులు చేసిన నిర్లక్ష్యానికి తాము బలవుతున్నామంటూ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల రీజనల్‌ రూరల్‌ బ్యాంక్‌  (ఆర్‌ఆర్‌బీ) ద్వారా క్లరికల్, పీఓ పోçస్టులకు నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్ష అనంతపురం జిల్లాలోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు.  2015 నుంచి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు  ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు.

    జిల్లాలో వసతులు ఉన్నాయి..

     వెయ్యిమంది ఒకే సారి ఆన్‌లైన్‌ పరీక్ష రాసేందుకు జిల్లాలో వసతులు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. జిల్లా  అధికారులను ఏమాత్రం సంప్రదించకుండా ఏఈఈ పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు అర్థమవుతోందని ఆయన చెప్పారు.  ఏదిఏమైనా గుంటూరు జిల్లాకు వెళ్లే కష్టాల నుంచి తప్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement