AEE posts
-
ఇంజనీరింగ్ కొలువుల భర్తీ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) ఉద్యోగాల భర్తీలో ముందడుగు పడింది. ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు నిర్వహించి ఏడాది కావస్తుండగా... తాజాగా కేటగిరీల వారీగా ప్రాథమిక ఎంపిక జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 సెపె్టంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 11 ప్రభుత్వ విభాగాల్లో 1,540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకుగాను గతేడాది జనవరిలో అర్హత పరీక్షలను కమిషన్ నిర్వహించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ... ఆ తర్వాత గతేడాది మే నెలలో మరోమారు అర్హత పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలో తాజాగా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కమిషన్ వెల్లడించింది. 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఏఈఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కూకట్‌పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లోని పరిపాలన విభాగంలో ఈ పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను తెరిచి చెక్‌లిస్టు డౌన్లోడ్ చేసుకోవాలని, అప్లికేషన్ పత్రాలను రెండు కాపీలు ప్రింట్ తీసుకోవాలని, అదేవిధంగా అటెస్టెషన్ పత్రాలను కూడా రెండు సెట్లు ప్రింట్ తీసుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. చెక్‌లిస్టులో నిర్దేశించినట్లుగా అభ్యర్థులు అన్నిరకాల సర్టిఫికెట్లుతో హాజరు కావాలని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించకుంటే తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చేది లేదని కమిషన్ తేల్చిచెప్పింది. వెబ్సైట్లో డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ పరీక్షల తేదీలు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(హెచ్‌డబ్ల్యూఓ) ఉద్యోగ అర్హత పరీక్షల తేదీలను కూడా కమిషన్ వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. డీఏఓ ఉద్యోగ ఖాళీలు 53, హెచ్‌డబ్ల్యూఓ ఖాళీలు 581 ఉన్నాయి. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1540 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాగా, ఈ నోటిఫికేషన్‌కు ఈ నెల 22 నుంచి వచ్చే అక్టోబర్ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. -
ఏఈఈ పరీక్ష వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆర్‌డబ్ల్యూఎస్‌లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీఆర్టీ)ను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉగాది పండుగ నేపథ్యంలో మార్చి 18న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహించనున్నట్లు పేర్కొంది. -
నిరుద్యోగులకు ‘ఆన్లైన్’ కష్టాలు
29, 30 తేదీల్లో ఏఈఈ పోస్టుల భర్తీకి పరీక్ష ఇచ్చిన ఆప్షన్లు కాకుండా గుంటూరు జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈ నెల 29, 30 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని వందలాది మంది అభ్యర్థులకు గుంటూరు జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఇక్కడి నుంచి 400 కిలోమీటర్ల దూరమున్న గుంటూరుకు వెళ్లాలంటే అధిక ఖర్చు భరించాల్సి వస్తోంది. దీనికి తోడు రెండు రోజులు అక్కడే ఉండాల్సి ఉంది. ముఖ్య మహిళా అభ్యర్థులు కుటుంబ సభ్యులను వెంట తీసుకొని పోవాల్సి ఉంటోంది. దీంతో ఈ ఖర్చు రెండింతలు అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కరెన్సీ కష్టాల నేపథ్యంలో అంతదూరం వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలకు కూడుకున్నదంటూ అభ్యర్థులు వాపోతున్నారు. అప్షన్ ఇచ్చినది ఒకటి... కేటాయింపు మరొకటి.. జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌కడప ఆప్షన్ ఇచ్చుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా గుంటూరు జిల్లాలో కేంద్రాలు కేటాయించడం గమనార్హం. అనంత జిల్లాలో ఎస్ఆర్ఐటీ కళాశాల, వీ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాలకు 350 మంది అభ్యర్థులను కేటాయించారు. వీటితో పాటు జిల్లాలో పీవీకేకే, శ్రీసాయి, ఎస్వీఐటీ, ఇంటెల్, మౌలాలి, అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఎస్ఎస్బీఎన్ కళాశాలలోనూ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వసతులున్నాయి. కానీ మిగిలిన అభ్యర్థులను గుంటూరు కేంద్రాలకు కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యం... అధికారులు చేసిన నిర్లక్ష్యానికి తాము బలవుతున్నామంటూ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల రీజనల్ రూరల్ బ్యాంక్ (ఆర్ఆర్బీ) ద్వారా క్లరికల్, పీఓ పోçస్టులకు నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష అనంతపురం జిల్లాలోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2015 నుంచి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. జిల్లాలో వసతులు ఉన్నాయి.. వెయ్యిమంది ఒకే సారి ఆన్లైన్ పరీక్ష రాసేందుకు జిల్లాలో వసతులు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. జిల్లా అధికారులను ఏమాత్రం సంప్రదించకుండా ఏఈఈ పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు అర్థమవుతోందని ఆయన చెప్పారు. ఏదిఏమైనా గుంటూరు జిల్లాకు వెళ్లే కష్టాల నుంచి తప్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
నెలాఖరుకల్లా నోటిఫికేషన్
- గ్రూప్-1, 3 పోస్టుల భర్తీ - ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ వెల్లడి - ఏఈఈ పోస్టులకు 29, 30న మెయిన్ పరీక్షలు సాక్షి, విశాఖపట్నం: గ్రూప్-1, 3లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ డా.పి.ఉదయభాస్కర్ వెల్లడించారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ గ్రూప్-1, గ్రూప్-3లో నోటిఫికేషన్లో వెయ్యికిపైగా పోస్టులు ఉండబోతు న్నాయన్నారు. జనవరిలో నోటిఫికేషన్ ఇస్తే వయోపరిమితిలో నిరుద్యోగులకు ఇబ్బంది ఏర్పడుతుందన్న భావనతోనే ఈ నెలాఖరులోగా జారీ చేయనున్నామని చెప్పారు. రెండు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్-2లో 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 256 ఏఈ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్, ప్రిలిమ్స్ పూర్తయ్యాయని, ఈనెల 29, 30 తేదీల్లో మెరుున్ పరీక్షలు నిర్వహించబోతున్నా మని తెలిపారు. ఈసారి పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా చేపట్టాలని ఆలోచనలో ఉన్నామని, పైగా పూర్తిగా జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. అవకత వకలకు ఆస్కారం లేకుండా ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ హాజరు, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏఈఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు రావడంతో 1:50 నిష్పత్తిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 37,489 మంది ఫైనల్ పరీక్షలకు అర్హత పొందారన్నారు. ఇటీవల గ్రూప్-2 కింద వివిధ కేడర్లలో 984 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటి వరకు 2.25 లక్షల దరఖాస్తులొచ్చాయని ఈనెల 10 వరకు గడువు ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గ్రూప్-2 పోస్టులకు రిజర్వేషన్లు వర్తించవన్నారు. -
నేడు, రేపు టీఎస్పీఎస్సీ పరీక్షలు
అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఏఈఈ పోస్టులకు.. సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి శని, ఆదివారాల్లో (ఈ నెల 17, 18) తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 48 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు శనివారం ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుంది. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు శనివారం ఉదయం జనరల్ స్టడీస్, ఆదివారం ఉదయం ఆప్షనల్ పేపర్ ఉంటుంది. ఏఈఈ పోస్టులకు ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాలి. పరీక్షలను పర్యవేక్షించేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. -
20 న ఏఈఈ పోస్టుల ఆన్లైన్ పరీక్ష
హైదరాబాద్ : ఈ నెల 20న ఏఈఈ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. 14 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్ధులకు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఏఈఈ పోస్టుల ఆన్లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బోర్డు వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 99 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అవసరమనుకున్న అభ్యర్ధుల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్ సభ్యులు తెలిపారు. -
తెలంగాణలో 20న తొలి పరీక్ష
⇒931 ఏఈఈ పోస్టులకు టీఎస్పీఎస్సీ ఆన్లైన్ (సీబీఆర్) టెస్ట్ ⇒ దేశంలోనే తొలిసారిగా సీబీఆర్ విధానం ⇒ 99 పరీక్షా కేంద్రాలు.. 30,783 మంది అభ్యర్థులు ⇒ గంటన్నర ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఉద్యోగార్థుల ఎంపికకు ఈ నెల 20న తొలిపరీక్ష నిర్వహించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్) పోస్టుల భర్తీకై టీఎస్పీఎస్సీ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు(హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్) కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ నిమిత్తం ఆయా పట్టణాల్లో మొత్తం 99 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్(సీబీఆర్) విధానంలో జరగనున్న ఆన్లైన్ పరీక్షకు మొత్తం 30,783 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణియన్ ఆదివారం తెలిపారు. ఒకేసారి 30 వేలమందికిపైగా అభ్యర్థులకు ఆన్లైన్లో టెస్ట్ నిర్వహించడం దేశంలోనే ప్రప్రథమమని ఆమె పేర్కొన్నారు. రెండు దఫాలుగా ఆన్లైన్ పరీక్షలు అభ్యర్థులు రెండు దఫాలుగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. 20న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు తొలి సెషన్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో సివిల్ ఇంజనీరింగ్ పేపర్ పరీక్ష జరగనుంది. ప్రతి సెషన్లోనూ 2.30 గంటల సమయం ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు గంటన్నర ముందుగానే చేరుకొని, రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలి. అభ్యర్థులు తమ అడ్మిట్(హాల్ టికెట్)కార్డులను www.tspsc.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మొత్తం ఆంగ్లమాధ్యమంలోనే ఉంటుంది. పరీక్ష రాసేముందు అభ్యర్థులు ఆన్లైన్లో ఇచ్చిన సూచనలను తప్పకుండా చదివితే, పరీక్ష రాయడం మరింత సులభంగా ఉంటుందని అధికారులు సూచించారు. అభ్యర్థులకు సూచనలు ఇలా.. - పరీక్షాకేంద్రాలకు వెళ్లే ముందు అభ్యర్థులు వెరిఫికేషన్ నిమిత్తం తమ హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు ధ్రువీకరణ (పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లెసైన్స్ తదితర) పత్రాల్లో ఒకదాన్ని వెంట తీసుకెళ్లాలి. - అభ్యర్థి ఫొటో, సంతకం ముద్రితమై ఉన్నం దున హాల్‌టికెట్‌ను లేజర్ ప్రింటర్, లేదా కలర్ ప్రింటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం మేలు. - హాల్‌టికెట్‌లో అభ్యర్థి ఫొటో సరిగా కనిపించనట్లైతే ఆథరైజేషన్ కోసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను వెంట తీసుకెళ్లాలి. - పరీక్షా కేంద్రానికి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, వాచ్, కాలిక్యులేటర్లు, పర్సులు, పేపర్లు తేకూడదు. ప్రశ్నలకు సంబంధించిన లెక్కలు చేసుకునేందుకు కంప్యూటర్లోనే వర్చువల్ కాలిక్యులేటర్ సదుపాయాన్ని కల్పిస్తారు. - వేలిముద్రల ద్వారా అభ్యర్థిని గుర్తించనున్నందున చేతులకు మెహందీ పెట్టకూడదు. - ఉదయం సెషన్లో 9.15, మధ్యాహ్నం సెషన్లో 1.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేటు వేస్తారు. ఒకసారి గేటు వేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం ఒంటగంట నుంచే పరీక్షాకేంద్రం లోపలికి అనుమతిస్తారు. - పరీక్షగదిలోకి 40 నిమిషాల ముందు అనుమతిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు పంపరు. - ప్రతి సెషన్లోనూ 150 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష మొత్తం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. - అంధులు, చేతి వేళ్లు లేని వైకల్య అభ్యర్థులు పరీక్ష రాసేందుకు స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చు. అంధులకు మాత్రమే అదనంగా 20 నిమిషాల సమయం ఇస్తారు.