మోటార్‌సైకిలిష్ట్‌ను డీకొట్టిన వ్యాన్
మోటార్‌సైకిలిష్ట్‌ను డీకొట్టిన వ్యాన్
Published Sat, Apr 15 2017 7:17 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
అన్నవరప్పాడు (పెరవలి): జాతీయ రహదారిపై అన్నవరప్పాడు వద్ద శుక్రవారం రాత్రి మోటార్‌సైకిలిష్ట్‌ను వ్యాన్ డీకొట్టటంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలైయ్యాడు. మండపేట నుండి తాడేపల్లిగూడెం వెళ్ళుతున్న మోటార్‌సైకిలిష్ట్ అన్నవరప్పాడు సెంటర్ వద్దకు వచ్చేటప్పటికి వ్యాన్ వేగంగా వచ్చి వెనుక డీకొట్టింది. దీనితో మోటార్‌సైకిలిష్ట్ ఆ వేగానికి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను డీకొట్టి పడిపోవటంతో తలకు బలమైన గాయం అయ్యింది. దీనితో హుటాహుటిన తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Advertisement
Advertisement