అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి
అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి
Published Sun, Aug 28 2016 10:49 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
– వీరశైవులకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి పిలుపు
– శ్రీశైలంలో వీరశైవ సాహిత్య సదస్సు
శ్రీశైలం: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వీరశైవులు అధ్యాత్మికతతోపాటు సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా కూడా అభివృద్ధిసాధించాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజీ అన్నారు. శ్రీశైలమహాక్షేత్రంలోని శరణు బసవేశ్వర సదాశివయ్య వీరశైవ నిత్యాన్నదాన సత్రంలో ఈ నెల 26 నుంచి జరుగుతున్న అఖిలభారత వీరశైవ మహాసభలో భాగంగా ఆదివారం వీరశైవ సాహిత్య సదస్సులో పీఠాధిపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యపరంగా ఎందరో వీరశైవ శివచరుణులు తమ ప్రవచనాలతో సాధారణ వ్యక్తులకు సైతం అర్థమయ్యే రీతిలో అనేక సత్యాలను బోధించారన్నారు. వీరశైవుల అభ్యున్నతికి బసవేశ్వరస్వామి చేసిన కషిని కొనియాడారు. హేమారెడ్డి మల్లమ్మ, అక్కమహాదేవి వంటి శివచరుణులెందరో శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుని ఆయనలో ఐక్యమైపోయిన వీరశైవుల ప్రగాఢమైన భక్తికి నిదర్శనంగా నిలిచినట్లు తెలిపారు. చరిత్రలో వీరశైవ మత గురువులు, మహాత్ములకు ఉన్నస్థానం వారు సమాజానికి అందించిన ధర్మసిద్ధాంతాలు, సేవలు ప్రతి ఒక్కరు మననం చేసుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ బాధ్యతను విస్మరిస్తే భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకుని వర్తమానాన్ని సరిపోల్చుకుంటూ భవిష్యత్ నిర్మాణానికి పూనాది వేయాల్సిన అవసరాన్ని వీరశైవులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే వీరశైవ ధర్మజాగతి కోసం సదాశివయ్యసత్రంలో సాహిత్య సదస్సు ఏర్పాటు చేసినట్ల తెలిపారు. కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన జగద్గురు సూర్యసింహాసన సమాజ సేవా సమితి అధ్యక్షులు నేతి జ్ఞానేశ్వర్, అఖిలభారత వీరశైవ మహాసభ అధ్యక్షులు నేతి మహేశ్వర్‌ను తెలంగాణ వీరశైవ సమాజానికి చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గసభ్యులను ఘనంగా సన్మానించారు. చివరి రోజు సమావేశంలో భాగంగా వీరశైవంలో గురు– జంగంల ప్రాధాన్యం– భక్తుల పాత్రపై సదాశివపేట కల్యాణమయ్యస్వామి, పంచాచారాలు, సామాజికస్పహ అనే అంశంపై సిద్ధిపేట ఆనందయ్య తమ పరిశోధనలను సమర్పించినట్లు నేతి జ్ఞానేశ్వర్ తెలిపారు.
Advertisement