అనంతపురం అగ్రికల్చర్: ఇక నుంచి ప్రతి నెలా మొదటి శనివారం వెటర్నరీ డేగా పాటించాలని డైరెక్టరేట్ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ మొదటి వెటర్నరీ దినోత్సవంతో ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని డివిజన్, పశువైద్యశాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెటర్నరీ డే నిర్వహించాల్సి ఉందన్నారు.