బతకాలని ఉంది.. ఆదుకోరూ..
Published Mon, Jul 25 2016 8:39 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
కారంపూడి: మృత్యువు ముంచుకొస్తోంది... మరి కొంత కాలం బతకాలని వుంది... దాతలు చేయూతనిచ్చి ఆదుకోవాలని మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మాగులూరి వీరాచారి అభ్యర్థిస్తున్నాడు. వివరాలు ఇలా వున్నాయి. వీరాచారి గ్రామంలో వడ్రంగం పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి మెదడు క్యాన్సర్ వచ్చింది. హైదరాబాదు నిమ్స్‌లో ఆపరేషన్ చేసి తలలోని క్యాన్సర్ గడ్డ తొలగించారు. మరో 35 రోజులు రేడియేషన్ చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఐతే డబ్బులు లేక ఇంటికి వచ్చాడు. ఇప్పుడు అతని ఒక కంటి చూపు కూడా క్యాన్సర్ ప్రభావం వల్ల పోయింది. భార్య కూడా అనారోగ్యం పాలయింది. వండ్రంగం పనికి శరీరం సహకరించకపోవడంతో ఇద్దరూ తేలిక పాటి కూలి పనులకు వెళ్లి జీవిస్తున్నారు. ఇంకా తనకు కొంత కాలం బతకాలని ఆశగా వుందని, నిత్యం ముంచుకొస్తున్న మృత్యువును తలుచుకుని అంతులేని వేదన అనుభవిస్తున్నాని వీరాచారి కన్నీటి పర్యంతం అయ్యాడు. సాయం చేయాలనుకున్న దాతలు సెల్ నంబరు 8008330520 సంప్రదించాలని వీరాచారి అభ్యర్థిస్తున్నాడు.
బతకాలని ఉంది.. ఆదుకోరూ..
Advertisement
Advertisement