విజయవాడ : పుస్తకాలు జీవితాన్ని మార్చిన సందర్భాలు ఉన్నాయని సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరైన ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ టాల్స్టాయి వంటి రచయితల ప్రభావం తనపై ఉందని గాంధీజీనే స్వయంగా వెల్లడించారన్నారు. మహాత్ముడి రచనలు మొత్తం ప్రపంచంలో అనేకమందిని ప్రభావితం చేశాయని రామచంద్రమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పుస్తకాలను అర్థం చేసుకుంటూ, అనుభవిస్తూ చదవాలని, పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని ఆయన సూచించారు.
కాగా 27వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం స్వరాజ్య మైదానంలో ప్రారంభమైంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశనేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
Sakshi editorial director K Ramachandra murthy, books, Vijayawada Book Festival, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, పుస్తకాలు, విజయవాడ పుస్తక మహోత్సవం
'పుస్తకాలు జీవితాన్ని మార్చిన సందర్భాలున్నాయి'
Published Fri, Jan 1 2016 8:26 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement