Vijayawada Book Festival
-
డిసెంబర్ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.మనోహర్‌నాయుడు, కె.లక్ష్మయ్య చెప్పారు. ఈ ఏడాది కూడా పుస్తక మహోత్సవాన్ని విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అన్ని రకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు -
విజయవాడలో పుస్తక మహోత్సవం.. ఎప్పుడంటే!
విజయవాడ కల్చరల్: విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు స్వరాజ్య మైదానంలో 32వ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి కె.లక్షయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారని తెలిపారు. గతంలో శాతవాహన కళాశాలలో నిర్వహించాలని నిర్ణయించినా, ప్రభుత్వ సూచన మేరకు ఈ ఏడాది కూడా స్వరాజ్య మైదానంలోనే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొంటాయని తెలిపారు. స్వరాజ్య మైదానంలో నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: తిరుపతిలో ఏపీ సర్వే ట్రైనింగ్ అకాడమీ) -
'సమగ్ర అభివృద్ధి'పై సమాలోచన
విజయవాడ : విజయవాడ స్వరాజ మైదానంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెస్టివల్లో గురువారం 'సమగ్ర అభివృద్ధి' అనే అంశంపై సమాలోచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రఘురాంరాజు, ఆచార్య గోపాల్ గురు, మాజీ సీఎస్ కాకి మాధవరావుతో పాటు పలువురి ప్రముఖులు పాల్గొని ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. -
నోట్ల రద్దుపై అనుభవం లేకనే ఇక్కట్లు
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విజయవాడ (వన్ టౌన్): నోట్ల రద్దు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగకపోవటం వల్ల అటు ప్రభుత్వ పెద్దలకు గానీ, ఆర్బీఐ అధికారులకు గానీ దాని అనుభావాలు తెలియలేదని, దీని వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. ఆర్బీఐ పని కేవలం నగదును ముద్రించి జారీ చేయటం మాత్రమే కాదన్నారు. దేశంలో బ్యాంకులకు బ్యాంకర్‌గా వ్యవహరించటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం, వడ్డీ రేట్లను సమీక్షించటం, ధరల పెరుగుదలను అరికట్టడం వంటి అనేక రకాల బాధ్యతలను ఆర్బీఐ నిర్వహిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది చాలా దేశాల్లో జరిగే ప్రక్రియేనని చెప్పారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని ముందుగా ప్రకటిస్తే దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించారు. కానీ నోట్ల రద్దు ఎందుకు చేశారనే అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పెద్దలు పలు రకాల ప్రకటనలు చేయటంతో తాను అయోమయానికి గురయ్యానని చెప్పారు. నోట్ల రద్దు ఫలితాలు మాత్రం ఇప్పటికిప్పుడు రావని, వాటికి రెండు మూడేళ్ల సమయం పడుతుందన్నారు. రానున్న కాలంలో పన్ను మీద ఆదాయం కనీసం రూ.50 వేల కోట్ల మేర రాకుంటే మాత్రం ఈ నిర్ణయం వృథా ప్రయత్నమేనని అభిప్రాయపడ్డారు. కాగా, నోట్ల రద్దు వ్యవహారంపై ప్రజలకు వ్యక్తమవుతున్న సందేహాలకు ఆర్బీఐ గవర్నర్ వంటి వ్యక్తులు సమాధానాలిచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
అది నాకు ముఖ్యమైన జ్ఞాపకం
అమెరికాలో 35 ఏళ్లుగా ఉంటున్న తానా అధ్యక్షుడు జంపాల చౌదరి సాహిత్యాభిమాని, వ్యాసకర్త, కథా రచయిత. పద్నాలుగేళ్లుగా విజయవాడ పుస్తక ప్రదర్శనకు హాజరవుతున్న ఆయన తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. ఏటా వస్తుంటాను నేను 2002 నుంచి పుస్తక ప్రదర్శనకు వస్తున్నాను. పుస్తకాలు, పుస్తకాలకు సంబంధించిన మనుషులు, పుస్తక ప్రచురణ కర్తలు, రచయితలు వస్తుంటాను. కొత్త పుస్తకాలు ఏం వచ్చాయి? ఎవరు ఏం చదువుతున్నారు?.. వంటివి పరిశీలిస్తాను. ఈ ప్రదర్శనకు దాదాపు రాష్ర్టం నలుదిక్కుల నుంచి అభిమానులు, రచయితలు వస్తున్నారు. వారిని కలవడం ఆనందంగా ఉంటుంది. వాస్తవానికి నేను ఈనెల 11వ తేదీన రావాల్సి ఉంది. ఆ రోజుతో ఈ ప్రదర్శన అయిపోతుంది కనుక, మూడు రోజులు ముందే వచ్చాను. పదేళ్లలో వచ్చిన మార్పు 2002 పుస్తక ప్రదర్శనలో చిన్నపిల్లల కోసం తెలుగు పుస్తకాలు కొనడానికి చాలా వెతకాల్సి వచ్చేది. ప్రస్తుతం పిల్లలకు తెలుగు పుస్తకాలు విరివిగా లభిస్తున్నాయి. పిల్లలకు కూడా చదవాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. ఆ మార్పు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది నాకు అన్ని రకాల పుస్తకాలు చదవడం ఇష్టం. సమకాలీన రచనలు, రాజకీయ రచనలు, విమర్శలు, సంప్రదాయ రచనలు... ఒకటేమిటి అన్నీ చదువుతాను. ప్రస్తుతం ఈ ప్రదర్శన స్థలం వైశాల్యం తగ్గడం వల్ల నడక తగ్గింది. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. నేను అనుకున్నదాని కంటే బాగుందనే చెప్పాలి. మరిచిపోలేని జ్ఞాపకాలు 2003 జనవరిలో బాపురమణలతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేశాం. నేను, శ్రీరమణ సంధాతలుగా వ్యవహరించాం. అది నాకు ముఖ్యమైన జ్ఞాపకం. అలాగే, మోహన్‌ప్రసాద్ గారిని కలిసి సుదీర్ఘంగా సంభాషించడం మరచిపోలేను. తానా తరఫున ఇక్కడే నాలుగు పుస్తకాలు విడుదల చేయడం ఒక మరపురాని అనుభూతి. ఆనందపడే విషయం పదేళ్లలో తెలుగు పుస్తకాలు ఎక్కువగా రావడం ఆనందించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా పుస్తకాలు కొని చదువుతున్నారు. ఇది మంచి పరిణామం. అయితే, సమకాలీన సాహిత్యానికి పెద్ద ఆదరణ లేదని, సంప్రదాయ సాహిత్యం లేదా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలను విరివిగా కొంటున్నారని విన్నాను. పాత సాహిత్యం చదివే వారికి కొత్తగా ఏం వస్తున్నాయో తెలియకపోవడం వల్లే వారు చదవట్లేదని అనుకుంటున్నాను. అలాగే, యువతరం ఆంగ్ల మాధ్యమం చదవడం వల్ల సాహిత్యం కంటే వారు ఇంకేదో కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. వాదాలు (ఇజమ్స్) సాహిత్యాన్ని బలోపేతం చేస్తాయి. వాదం వల్ల కొత్త పాఠకులు వస్తారు. -
'పుస్తకాలు జీవితాన్ని మార్చిన సందర్భాలున్నాయి'
-
'పుస్తకాలు జీవితాన్ని మార్చిన సందర్భాలున్నాయి'
విజయవాడ : పుస్తకాలు జీవితాన్ని మార్చిన సందర్భాలు ఉన్నాయని సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరైన ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ టాల్‌స్టాయి వంటి రచయితల ప్రభావం తనపై ఉందని గాంధీజీనే స్వయంగా వెల్లడించారన్నారు. మహాత్ముడి రచనలు మొత్తం ప్రపంచంలో అనేకమందిని ప్రభావితం చేశాయని రామచంద్రమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పుస్తకాలను అర్థం చేసుకుంటూ, అనుభవిస్తూ చదవాలని, పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా 27వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం స్వరాజ్య మైదానంలో ప్రారంభమైంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశనేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. Sakshi editorial director K Ramachandra murthy, books, Vijayawada Book Festival, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, పుస్తకాలు, విజయవాడ పుస్తక మహోత్సవం