విజయవాడలో పుస్తక మహోత్సవం.. ఎప్పుడంటే! | Vijayawada Book Festival 2022: Date, Venue Details Here | Sakshi
Sakshi News home page

విజయవాడలో పుస్తక మహోత్సవం.. ఎప్పుడంటే!

Published Sat, Dec 25 2021 3:01 PM | Last Updated on Sat, Dec 25 2021 3:01 PM

Vijayawada Book Festival 2022: Date, Venue Details Here - Sakshi

విజయవాడ కల్చరల్‌: విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు స్వరాజ్య మైదానంలో 32వ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి కె.లక్షయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారని తెలిపారు. గతంలో శాతవాహన కళాశాలలో నిర్వహించాలని నిర్ణయించినా, ప్రభుత్వ సూచన మేరకు ఈ ఏడాది కూడా స్వరాజ్య మైదానంలోనే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొంటాయని తెలిపారు. స్వరాజ్య మైదానంలో నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: తిరుపతిలో ఏపీ సర్వే ట్రైనింగ్‌ అకాడమీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement