Book Exhibition
-
పుస్తక ప్రదర్శనతో బాపూ భావజాలం ఆకళింపు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ ఆలోచనలను, భావజాలాన్ని ఆకళింపు చేసుకొనేందుకు పుస్తక ప్రదర్శన ఎంతో దోహదం చేస్తుందని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్నారు. ‘మంచి పుస్తకం చెంతన ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే‘.. అన్న గాంధీ సూక్తిని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఇతర సీనియర్ అధికారులతో కలసి సీఎస్ శనివారం పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరఖాను, చేనేత మగ్గాన్ని, ఎద్దు గానుగ యంత్రాన్ని తిలకించారు. -
విజయవాడలో పుస్తక మహోత్సవం.. ఎప్పుడంటే!
విజయవాడ కల్చరల్: విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు స్వరాజ్య మైదానంలో 32వ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి కె.లక్షయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారని తెలిపారు. గతంలో శాతవాహన కళాశాలలో నిర్వహించాలని నిర్ణయించినా, ప్రభుత్వ సూచన మేరకు ఈ ఏడాది కూడా స్వరాజ్య మైదానంలోనే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొంటాయని తెలిపారు. స్వరాజ్య మైదానంలో నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: తిరుపతిలో ఏపీ సర్వే ట్రైనింగ్ అకాడమీ) -
‘పుస్తకాలు జ్ఞానాన్ని వెలిగించే దీపాలు’
సాక్షి, హైదరాబాద్: పుస్తకాలు జ్ఞానాన్ని వెలిగించే దీపాలని, జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలు దోహదపడాలని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వచ్చే నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో జరగనున్న బుక్‌ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించాలని సూచించారు. శనివారం మంత్రి తన నివాస ప్రాంగణంలో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వం పుస్తక ప్రదర్శనకు అన్ని రకాల అండదండలను అందిస్తూ వస్తోందని తెలిపారు. ప్రముఖ నటుడు, సామాజిక చిత్రాల నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పుస్తక ప్రియులు హాజరుకావాలని, ఇది అతిపెద్ద పుస్తక పండగలా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, శరత్ పాల్గొన్నారు. -
ఇంకొన్ని రోజులు ఉంటే బాగుటుంది..
-
బుక్ ఫెయిర్‌ను ప్రారంభించిన గవర్నర్
-
బొకేలు వద్దు, పుస్తకాలు కావాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: పుస్తకం చదవకుండా తనకు రోజు గడవదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను సోమవారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో మాట్లాడారు. పుస్తక ప్రదర్శనకి రావడం చాలా సంతోషంగా ఉందని, అందరూ పుస్తక పఠనం చేయాలని కోరారు. తాను గవర్నర్, రైటర్, డాక్టర్ అయినప్పటికీ చదువరిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తనను కలవడానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు కాకుండా పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఇల్లు కట్టుకునే వారు తప్పనిసరిగా రీడింగ్ రూమ్ ఉండేలా చూసుకోవాలన్నారు. పుస్తకం చదవడం చాలా ముఖ్యమైన పని అని, తాను ఇంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు పడుకునే ముందు ఒక గంట బుక్ చదువుతానని వెల్లడించారు. యువత ప్రతి ఒక్కరు ఇక్కడున్న 330 బుక్ స్టాల్స్ ని సందర్శించాలని అభిలషించారు. బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పుస్తక ప్రదర్శనకు నగర వాసులు భారీగా తరలిచ్చారు. -
పుస్తకాల పండుగొచ్చే
సాక్షి హైదరాబాద్: నగరానికి పుస్తకాల పండగొచ్చింది. ప్రతి ఏటా డిసెంబరులో 9 రోజులపాటు జరిగే పుస్తకాల ప్రదర్శన పుస్తక ప్రియులకు ఓ ప్రత్యేకమైన సంబురం. నేటి నుంచి తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్ స్టేడియంలో) 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ప్రారంభం కానుంది. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లు, దాని ప్రత్యేకతలను బుక్ ఫెయిర్ ప్రతినిధులు ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ శోభన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. మొత్తం 330 స్టాళ్లు ఈసారి ప్రదర్శనలో 330 స్టాళ్లు ఏర్పాటు చేశారు, వీటిలో ప్రముఖ ప్రచురణ సంస్థల, పత్రికల స్టాల్స్, తెలుగు, ఇంగ్లిషు సహా అన్ని భాషల పుస్తకాల స్టాళ్లు ఉన్నాయి. ఇక పిల్లలను పుస్తకాలు చదివించేలా బాల మేళాను ప్రముఖంగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. గతేడాది 10 లక్షల మంది పాల్గొన్నారని, నగరానికి 50–100 కి.మీ పరిధిలోని పాఠశాలలు తమ విద్యార్థులతో రావాలని గౌరీశంకర్ ఆహ్వానించారు. ఇప్పటివరకు 2 లక్షల పాస్‌లను పంపిణీ చేశామన్నారు. ఎప్పుడు: పుస్తక ప్రదర్శన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా గంటా చక్రపాణి, బి.వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. -
విజయవాడలో పుస్తక మహోత్సవం
సాక్షి, విజయవాడ: వచ్చే జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని స్వరాజ్ మైదానంలో 30వ పుస్తక మహోత్సం ప్రారంభమవుతుందని, నవ్యాంధ్ర పుస్తక సంబరాల కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తెలిపారు. పుస్తక మహోత్సవాలకు సంబంధిచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలను నవ్యాంధ్ర పుస్తక సంబరాలు 2019 పేరుతో నిర్వహిస్తున్నాం. పుస్తక ఉత్సవాలను విజయవాడ బుక్ ఫెస్టివల్, ఎన్టీఆర్ ట్రస్ట్, ఏపీ భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిసున్నామని అన్నారు. ఈ పుస్తక ఉత్సవాలను ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆచార్య రాజమోహన్ గాంధీ, ఉషాగాంధీ, ఆచార్య కొలకలూరి నవీన్, ఆచార్య రఘురాజులు ప్రారంభ సభకి హాజరవుతారు. ప్రారంభ సభలో ఆచార్య రాజమోహన్ గాంధీ, ఉషాగాంధీల కీలక ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. జనవరి 4వ తేదీన పుస్తక ప్రియుల నడక కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్ర మూర్తి, ఆంధ్ర జ్యోతి సంపాదకులు, కె.శ్రీనివాస్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లు పాల్గొంటారు. 5వ తేదీన జరిగే సాహితీ సభకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ హాజరవుతారని కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తెలిపారు. -
పుస్తక ప్రియులకు విందు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈనెల 18 నుంచి జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కవాడిగూడ, ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాలు కొలువుతీరనున్నాయి. ఈనెల 18 న ప్రారంభమయ్యే ఈ పుస్తక ప్రదర్శన 28 వరకు జరుగుతుంది. దేశ వ్యాప్తంగా 300 మంది ప్రచురణకర్తలు పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి చంద్రమోహన్ కోయి తెలిపారు. -
ఒక్కో స్టాల్.. ఒక్కో ప్రత్యేకత
ఒక్కో స్టాల్లో ఒక్కో ప్రత్యేకత. ఒక్కో పుస్తకం ఎన్నో అంశాల కలబోత. మొత్తంగా విజయవాడ పుస్తక మహోత్సవమే ఓ విజ్ఞాన భాండాగారంగా మారిపోయింది. ఎటుచూసినా పుస్తకాలే. ఎక్కడ విన్నా విజ్ఞానాన్ని పంచే విషయాలే. చిన్నారులు నేర్చుకునే అ..ఆ..ల నుంచి పెద్దల ఆధ్యాత్మిక పుస్తకాల వరకూ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే స్టాల్లో ఏ రకమైన పుస్తకాలు ఉన్నాయి? అనే వివరాలు మీకోసం ప్రత్యేకం.. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ ‘నోట్’ దిస్ పాయింట్ బుక్ ఎగ్జిబిషన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్టాల్ పెట్టడం ఇదే ప్రథమం. ఫైనాన్షియల్ లిటరసీ అనేది రిజర్వ్ బ్యాంకు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ‘మీ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోండి..’ అనే అంశంపై ఇక్కడ ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. చిరిగిన నోట్లను వెనక్కు ఇవ్వడం ఎలా అనే విషయాలను వివరిస్తున్నారు. పెద్దపెద్ద బ్యాంకులు, సంస్థల పేర్లతో వచ్చే తప్పుడు మెయిల్స్‌ని గుర్తించడం ఎలా?, పైచదువుల కోసం విదేశాలకు వెళ్లేవారికి ఫారెన్ ఎక్స్ఛేంజ్పై అవగాహన, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, ప్రైవేటు సంస్థల్లో అంటే నాన్‌బ్యాంకింగ్ రంగాల్లో డబ్బు పొదుపు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... వంటి ప్రధాన అంశాల గురించి ఉచితంగా బ్రోచర్లు పంచుతున్నారు. పదేళ్ల వయసు దాటిన పిల్లలు బ్యాంక్ అకౌంట్ తెరవడం ఎలా? ఏటీఎం కార్డు ఉపయోగించడం, చెక్ బుక్ వాడటం అన్నీ వివరిస్తున్నారు. ..ఈ వివరాలకు సంబంధించిన విషయాలను కామిక్ బుక్స్ రూపంలో పిల్లలకు అంటే 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నామని ఆర్బీఐ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. తమ స్టాల్‌కు మంచి స్పందన వస్తోందన్నారు.