సాక్షి, విజయవాడ: వచ్చే జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని స్వరాజ్ మైదానంలో 30వ పుస్తక మహోత్సం ప్రారంభమవుతుందని, నవ్యాంధ్ర పుస్తక సంబరాల కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తెలిపారు. పుస్తక మహోత్సవాలకు సంబంధిచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలను నవ్యాంధ్ర పుస్తక సంబరాలు 2019 పేరుతో నిర్వహిస్తున్నాం. పుస్తక ఉత్సవాలను విజయవాడ బుక్ ఫెస్టివల్, ఎన్టీఆర్ ట్రస్ట్, ఏపీ భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిసున్నామని అన్నారు.
ఈ పుస్తక ఉత్సవాలను ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆచార్య రాజమోహన్ గాంధీ, ఉషాగాంధీ, ఆచార్య కొలకలూరి నవీన్, ఆచార్య రఘురాజులు ప్రారంభ సభకి హాజరవుతారు. ప్రారంభ సభలో ఆచార్య రాజమోహన్ గాంధీ, ఉషాగాంధీల కీలక ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. జనవరి 4వ తేదీన పుస్తక ప్రియుల నడక కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్ర మూర్తి, ఆంధ్ర జ్యోతి సంపాదకులు, కె.శ్రీనివాస్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లు పాల్గొంటారు. 5వ తేదీన జరిగే సాహితీ సభకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ హాజరవుతారని కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment