తాళంబేడు వారిపల్లిలో మురుగునీరు
– తూర్పు మండలాల్లో
– గిట్టుబాటు కాని ధర
– పశ్చిమాన్ని పీడిస్తున్న కరువు
– పల్లెలకు చాలీచాలని నిధులు
– కనుచూపు మేరలో కనిపించని ప్రగతి
చిత్తూరు జిల్లాలోని గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. పంటకు గిట్టుబాటు ధర లేక తూర్పు మండలాల్లో.. పంట పండక పడమరలో రైతులు విలవిల్లాడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్పితే, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులేవీ విదల్చడం లేదు. దీంతో పల్లెలు చితికిపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సంఘాల ద్వారా ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 56 కోట్లు విడుదల అయ్యాయి. 1,350కి పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి చేరేవి రూ.4 లక్షలు మాత్రమే! ఈ నిధులతో ఒక నెల మంచి నీటిని కూడా అందించే
పరిస్థితి లేదని విమర్శలు వస్తున్నాయి.
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ఏ పల్లె చూసినా దిగాలుగా కనిపిస్తోంది. అభివృద్ధి ఛాయలు కనుచూపుమేరలో కనిపించడంలేదు. ముఖ్యంగా పాలకులకు దూరదృష్టి లేకపోవడంతో పశ్చిమ మండలాల ప్రజలు సురక్షిత నీరు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతితో పల్లెలకు సురక్షిత తాగునీరు అందిస్తామనే మాటలు నీటి మూటలవడంతో బోర్లలో వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగుతూ జబ్బుల బారిన పడుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షపాతం కూడా తక్కువ నమోదవుతుండటంతో భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఈ మండలాలను కృష్ణ నీటితో తడిపేస్తామనే మాట ఎండమావిగా మిగిలింది. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే స్పెషల్ డెవలప్ ఫండ్ రూ.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే వాడుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
1.21 లక్షల హెక్టార్లలో పంట నష్టం
జిల్లాలో సుమారు 1.92 వేల ఎకరాల్లో రైతులు వేరుశనగ సాగుచేశారు. వర్షాభావంతో సుమారు 1.21 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. దీనివల్ల సుమారు రూ.130 కోట్లు రైతులు నష్టపోయారు. గత మూడేళ్లుగా ఇన్‌పుట్ సబ్సిడీ కూడా రైతులకు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా చితికిపోయారు.
ఏటేటా పెరుగుతున్న వలసలు
జిల్లాలో ప్రతి ఏటా వలసలు పెరుగుతున్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేక, వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లుతున్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గం నుంచే ప్రతి రోజూ 10 వేల మంది వలసలు వెళ్లుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రైతులు, వ్యవసాయ కూలీలు బెంగళూరు, చెన్నై, కొచ్చి లాంటి ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా వెళుతున్నారు. అరకొర కూలీతో బతుకుపోరాటం చేస్తున్నారు. పదెకరాలున్న రైతు కూడా దుర్భర జీవితం గడుపుతున్నాడు. వలసలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తూర్పు.. నిట్టూర్పు
జిల్లాలోని తూర్పు మండలాల్లో ప్రధానంగా పారిశుద్ధ్య లోపంతో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో అక్కడ రోగాలు ప్రబలుతున్నాయి. దేశం మొత్తం స్వచ్ఛ భారత్ నినాదం మార్మొగుతున్నా జిల్లాలోని గ్రామాలు అపరిశుభ్రంగా మురుగునీటితో ఉన్నాయి. సర్పంచ్‌లు ఆదాయం తెచ్చిపెట్టే సిమెంట్ రోడ్లు పనులే చేస్తుండటంతో పారిశుద్ధ్య సమస్యలపై దృష్టిపెట్టే నాథుడే కరువయ్యారు. దీనికితోడు రైతులకు చెరకుపై గిట్టుబాటు ధర లేకపోవడంతో విలవిల్లాడుతున్నారు.
నిధుల్లేక అభివృద్ధి కుంటుపడుతోంది
గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నిధుల్లేవు. కాలువలు సరిగాలేక మురుగునీరు మొత్తం రోడ్లపైకి వస్తోంది. దీన్ని అనేక సార్లు అధికారులు తెలిపారు. 14 ఆర్థికసంఘం నిధులు వస్తే కేటాయిస్తాం అన్నారు. ఆ నిధులు ఏమూలకు సరిపోతాయి. పంచాయతీలోని ప్రతి ఇంటికి వురుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ పంచాయితీ చేద్దావునుకున్నా. వురుగుదొడ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేÄýæులేదు. దీంతో వురుగుదొడ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి.
–జి.తొప్పÄýæ్యు, సర్పంచ్, నీరువాయి గ్రావుం, పిచ్చాటూరు
ఇలా ఎన్నాళ్లు ?
సర్పంచ్‌గా ఎన్నికయ్యి దాదాపు మూడేళ్లవుతోంది. ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా లేదు. ప్రజల్లోకి వెళ్లాలంటే మొహం చాలట్లేదు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. బ్లీచింగ్ చల్లిద్దామన్నా నిధుల్లేవు.
–ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ ఎం.బయపల్లి.ఐరాల మండలం