భక్తులకూ వీఐపీ ఆశీర్వచనం | vip Blessing for devotees | Sakshi
Sakshi News home page

భక్తులకూ వీఐపీ ఆశీర్వచనం

Published Fri, Aug 12 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

vip Blessing for devotees

  • రూ.1000 అతిథి మర్యాదలు
  •  వేములవాడ: వేములవాడ రాజన్నను దర్శించుకునే వీవీఐపీలు, ప్రొటోకాల్‌ అతిథులకు ఇచ్చే గౌరవ మర్యాదల్లో కొన్నింటిని భక్తులకూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రూ.వెయ్యి చెల్లిస్తే ప్రత్యేక దర్శనంతో పాటు వేదోక్త ఆశీర్వచనం గావించనున్నారు. ప్రత్యేక వూర్గం ద్వారా ప్రత్యేక దర్శనం, దేవస్థాన పండితులతో ఆశీర్వచనం, శ్రీస్వామివారి మహాప్రసాదం, శేషవస్త్రాలుగా స్వామివారి రెండు లడ్డూలు, ఒక కండువా, రెండు కనుములు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లను ముఖ్య బుకింగ్, పీఆర్‌వో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement