వేతనాల పెంపుపై వీఆర్‌ఏల సంఘం హర్షం | VRA wages increased | Sakshi
Sakshi News home page

వేతనాల పెంపుపై వీఆర్‌ఏల సంఘం హర్షం

Published Sun, Feb 26 2017 11:26 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

VRA  wages increased

ఇబ్రహీంపట్నం రూరల్‌: రాష్ట్రంలోని వీఆర్‌ఏల వేతనాలు పెంచడం అభినందనీయమని తెలంగాణ వీఆర్‌ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్కుడు ముత్యాలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం మరువలేనిదన్నారు. ఇన్నాళ్లుగా తక్కువ వేతనంతో పని చేస్తున్న వీఆర్‌ఏలకు రూ.10,500కు పెంచడం శుభపరిణామమన్నారు.

వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం చాలా సంతోషించదగిన విషయమన్నారు. గత ప్రభుత్వాల హయాలంలో నియామకమైన వీఆర్‌ఏలకు తెలంగాణ ప్రభుత్వం వరాలు ప్రకటించి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. వారసత్వ ఉద్యోగులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. విధుల్లో మరింత శ్రద్ధగా భాగస్వాములమవుతూ ప్రభుత్వాన్ని అగ్రభాగంలో నడిపేందుకు పాటుపడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement