‘కాకతీయ’ నుంచి నీరు లీకేజీ
Published Mon, Aug 8 2016 10:58 PM | Last Updated on Wed, Aug 1 2018 3:48 PM
ఉప్లూర్ (కమ్మర్‌పల్లి): మండలంలోని ఉప్లూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువ డిస్ట్రిబ్యూటరీ కాలువ నుంచి నీరు వృధాగా పోతోంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీరు విడుదల కొనసాగుతోంది. 19వ డిస్ట్రీబ్యూటరీ వద్ద నిర్మించిన తూముకు లీకేజీ ఏర్పడడంతో నీరు వృథాగా పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తూము కింది భాగంలో సిమెంట్ దిమ్మెలు కదిలిపోవడంతో షెట్టర్, సిమెంట్ దిమ్మెలకు మధ్య ఖాళీ ఏర్పడి నీరు వృథాగా పోతోంది. సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే మూడు రోజుల క్రితం వచ్చి తూములో ఇసుక సంచులు కుక్కి చేతులు దులుపుకున్నారని రైతులు తెలిపారు. కాని లీకేజీ మాత్రం ఆగలేదు. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో లీకైన నీరు కాలువల ద్వారా పంట పొలాలకు చేరుతోంది. నీరు నీరు లీకేజీతో ఇటీవల వేసిన వరినాట్లు కొట్టుకుపోతున్నాయని అధికారులకు సమాచారం అందించినా, పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. లీకేజీ నీరు వరినాట్లను ముంచెత్తుతోందని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Advertisement