ఇంటింటికీ మంచినీటి సరఫరా
ఇంటింటికీ మంచినీటి సరఫరా
Published Tue, Nov 29 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
శేరిలింగంపల్లి: ఇంటింటికీ మంచినీటి సరఫరాకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను కార్పొరేటర్ తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి డివిజన్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లతో కలిసి సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నీటి సరఫరా లైన్లు, రిజర్వాయర్లకు సుమారు రూ.1900 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి డివిజన్ కార్యాలయాలు దోహదపడతాయన్నారు.
ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.600 కోట్లతో చేపట్టిన మంజీర పైప్‌లైన్, రిజర్వాయర్ల పనులు మార్చినాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెలే గాంధీలను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్లు వి.జగదీశ్వర్‌గౌడ్, కొమిరిశెట్టి సారుుబాబా, బొబ్బ నవతారెడ్డి, మేక రమేష్, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, ఎస్‌ఈ మోహన్‌సింగ్, ఈఈ మోహన్‌రెడ్డి, నాయకులు మిరియాల రాఘవరావు, వీరేశంగౌడ్, బొల్లంపల్లి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement