మేము నల్లగొండజిల్లాలోనే ఉంటాం
మిర్యాలగూడ టౌన్: ‘మేము.. నల్లగొండ జిల్లాలోనే ఉంటాం.. ఈ జిల్లా కన్నతల్లి.. మాకు సూర్యాపేట సవతి తల్లి.. మూసీ అవుతలా సూర్యాపేట జిల్లా.. మూసీ ఇవతల నల్లగొండ జిల్లా ఉంది’ అంటూ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ మట్టిమనుషులు ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపంవద్ద పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మట్టిమనుషులు వేనేపల్లి పాండు రంగారావు మాట్లాడుతూ మిర్యాలగూడను సూర్యాపేట జిల్లాలో కలిపే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టాలని, ప్రజల కోరిక మేరకే విభజన చేపట్టాలన్నారు. మిర్యాలగూడను నల్లగొండ జిల్లాలో కాకుండా సూర్యాపేట జిల్లాలో కలిపితే మరో ఉద్యమం మిర్యాలగూడ నుంచే ప్రారంభం అవుతుందన్నారు. అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను కూడా తీసుకోవాలన్నారు. మిర్యాలగూడను నల్లగొండలోనే కొనసాగించాలంటూ ఈనెల 19వ తేదీ నుంచి కాం్రVð స్, టీడీపీ, బీజేపీ. సీపీఐ. ఎంసీపీఐ, ఆమ్‌ఆద్మీ పార్టీ, లోక్‌సత్తా, మాలమహానాడు, తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో విడివిడిగా సాగర్ రోడ్డులో దీక్షలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఎంఏ కరీం, గంధం సైదులు, చౌగాని వెంకన్న, నసీరుద్దీన్‌బాబా, రుషికేశ్వర్‌రాజు, తాళ్లపల్లి రవి, టి. అశోక్, మాశెట్టి అశోక్ తదితరులున్నారు.