కొవ్వూరు (పశ్చిమగోదావరి): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి తమ పరిధిలో ఉన్న ఇళ్లన్నిటికీ విద్యుత్ సౌకర్యం సమకూర్చనున్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ్ధ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఆర్. ముత్యాలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇందుకోసం కేంద్రం రూ.120 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అక్టోబర్ నాటికి ఐదు సర్కిళ్లను పేపర్ లెస్ కార్యాలయాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా బ్యాంకుల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.