మోగింది కల్యాణ వీణ | wedding time starts | Sakshi
Sakshi News home page

మోగింది కల్యాణ వీణ

Published Tue, Aug 2 2016 6:10 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

మోగింది కల్యాణ వీణ - Sakshi

మోగింది కల్యాణ వీణ

మోగనున్న పెళ్లి బాజాలు
ఈనెల 6నుంచి మహూర్తాలు
ఒక్కటి కానున్న వేలాది జంటలు

శుభ కార్యాలకు మంచి ఘడియలు రానే వచ్చాయి. మూడు నెలలుగా మంచి రోజులు లేక శుభ ముహుర్తాలన్ని ఆగిపోయాయి. శ్రావణమాసం రాకతో ఆగిన పెళ్లిళ్లు  శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకమంటు పాటల మోతలు  మోగనున్నాయి. రెండు మనస్సులకు మూడు ముళ్ల బంధం వేసి...జీవితాంతం తోడుగా ఉంటామంటు.. ఏడడుగులు వేసి .. నవగ్రహాల చల్లని దీవెనలతో దాంపత్య జీవితాన్ని పండించుకోవాలని ఉవ్విళ్లూరే యువతీ, యువకులు ఎదురుచూసే మంచి ముహుర్తం రానే వచ్చేశాయి. ఆగస్టు 6 నుంచి శుభ ఘడియలు ప్రవేశించడం, నెలాంతం వరకు మాత్రమే ముహుర్తాలుండడంతో పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాల సందడి ఊపందుకోనున్నాయి. ఫంక్షణ్‌ హాళ్ల నుంచి, పోటో గ్రాఫర్ల వరకు బుక్‌ చేయడంలో పెళ్లి పెద్దలు నిమగ్నమయ్యారు. దీంతో శుభాకార్యాల నిర్వాహణ వ్యాపారాలు జోరందుకున్నాయి.                     - ఘట్‌కేసర్‌ టౌన్‌

శుభకార్యాల గడియలు ...
పెళ్లిళ్లు కావలసిన యువతీ, యువకులు ఎదురు చూసే పెళ్లి ముహుర్తాలు మూడు నెలల అనంతరం ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానున్నండంతో ఆకాశమంత పందిరి భూదేవంత పీటలు వేసి అత్యంత వైభవంగా నిర్వహించే పెళ్లిళ్ల సందడికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన మంచి ఘడియాలు   నెలాంత వరకే ఉన్నాయి. శ్రావణ మాసం ముగింపు అనంతరం వచ్చే అమవాస్యతో శూన్యమాసం ప్రారంభం అవుతుంది. శూన్యమాసంలో మంచి ముహుర్తాలు ఉండని కారణంగా ఆగస్టు నెలలోనే శుభకార్యాలన్ని నిర్వహించడానికి ఉద్యుక్తులవుతున్నారు.

         శ్రావణమాసం ఆగస్టు 3 నుంచి ప్రారంభంమై సెప్టెంబర్‌ 1 వరకున్న ఆగస్టు 6,7, 13, 18, 20, 21, 25, 26, 27 శుభాకార్యలకు అనువైన రోజులున్నాయి. అప్పటి వరకు పెళ్లి ఏర్పాట్లు, బంధువుల రాకతో ఇళ్లన్ని కిటకిటలాడనున్నాయి. శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదం పితృ దేవతలకు పిండ ప్రధానాలు చేయడంతో మంచి కార్యక్రమాలు జరగవు. అనంతరం కార్తీక, మార్గశిరం, ఆశ్వయుజ మాసాల్లో పెళ్లిళ్లకు మంచి సమయమైన దసరా పండుగ తర్వాతే మంచి ముహుర్తాలు రానున్నాయి. దీంతో శుభా కార్యాలకు తక్కువ సమయం ఉండడంతో పెళ్లి ఏర్పాట్లుకు ఇబ్బందులు తప్పవనిసిస్తోంది. అవకాశమున్న ముహుర్తాలకే పెళ్లిళ్లు జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు.

జోరందుకున్న వ్యాపారాలు....
పెళ్లి వేడుకలు శుభలేకలతో ప్రారంభం అవుతుంది. తమతమ ఆర్థిక స్థోమత,  హోదాక తగ్గట్టుగా రూ. 10-100ల వరకు ఎంచుకుంటున్నారు. బాజ, బజంత్రీల కోలాహాలం తక్కువేమి కాదు. పెళ్లి తంతు నుంచి సాగనంపే వరకు రూ. 10వేల నుంచి లభిస్తోంది. నేటి రోజుల్లో ఆర్కెస్ట్రా ఏర్పాట్లు కూడ తప్పనిసరయింది. పెళ్లి కొనుగోళ్లలో మొదటి ప్రాధాన్యం బంగారం కాగ ఆనంతరం దుçస్తులదే. నేడు 10 గ్రాముల బంగారం రూ. 31,000లకు చేరుకుంది. వ«ధూవరుల దుస్తులతో పాటు బంధువులకు కానుకాలుగా ఇవ్వాల్సీ ఉంటుంది.lరూ. 20 వేల నుంచి లక్షల వరకు నేడు వెచ్చిస్తున్నారు. పెళ్లి తంతు ముగిసేది భోజనం కార్యక్రమంతోనే.  విందు నిర్వాహణను నేడు ఎవరు లెక్కించడం లేదు. తక్కువలో తక్కువ లక్షను నుంచి లక్షల వరకు వ్యయం చేస్తున్నారు. ఇంటి ముందర టెంటు వేసి పెళ్లి చేసే పరిస్థితులు నేడు లేని కారణంగా మద్య, ఉన్నత వర్గాల ప్రజలు ఫంక్షన్‌ హాళ్లను ఎంచుకుంటున్నారు.

         ఏసీ సౌకర్యాలతో కూడ నేడు లభిస్తుండగా స్థాయి, సౌకర్యాలను బట్టి రూ. 50 వేల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. పురుహితుల దక్షణ కూడ అమాంతం పెరిగిపోయింది. పెళ్లి వారి ఆర్థిక స్థాయిని బట్టి వేలను దక్షిణగా స్వీకరిస్తున్నారు. హోదాను బట్టి రవాణ సౌకర్యం ఏర్పాట్లును కూడ భారీగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందస్తుగా కార్లు, బస్సులను బుకింగ్‌ చేసుకుంటున్నారు. పెళ్లి కల రావడానికి ముఖ్యమైంది పూల అలంకరణ. పెళ్లి వేడుకలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవడానికి పెద్ద ఎత్తున బంతి, చామంతి, మల్లు, విరజాజి, సన్నజాజి, కనకాంబరం, లిల్లీ తదితర పూజలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నారు. వధూవరుల వాహనం, మండపాలను అందమైన పూలతో అలంకరిస్తున్నారు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లకు ముందస్తుగా డబ్బులు చెల్లించి ఒప్పందం చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని పర్యవేక్షించే బాధ్యతను అప్పగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement