muhurthaalu
-
ముహూర్తం ముందరున్నది
సాక్షి, అమరావతి: ‘‘మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది.. మా అమ్మాయి జాతకానికి మీ అబ్బాయి జాతకం బాగా కుదిరింది.. మనం ఇప్పుడే ఒక మాట అనుకుని పెళ్లి ఖాయపర్చుకుంటే మూఢం వెళ్లగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం’’ రాష్ట్రంలో ప్రస్తుతం పెళ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులు మధ్య సాగుతున్న సంభాషణ ఇది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వస్తున్న శుభ ముహూర్తాలకు తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. దీంతో వివాహాలు జరిపించేందుకు శుభలగ్నం కోసం ఎదురుచూస్తున్నారు. మూఢం ముగియడంతో నవంబర్ 28 నుంచి శుభ ముహూర్తాలు రానున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం (సంక్రాంతి నెల) కావడంతో వివాహాలు చేయరు. దీంతో వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 9 వరకు 18 శుభముహుర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. ముందుంది ముహూర్తం అంటూ.. పెళ్లి ఏర్పాట్లలో వధూవరుల కుటుంబాలు బిజీ అవుతున్నాయి. మార్కెట్లకు పెళ్లి కళ.. ప్రస్తుత శుభకృత్ నామ తెలుగు సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే మార్చి వరకు దేశ వ్యాప్తంగా 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోనే లక్షా 50 వేలకుపైగా వివాహాలు జరుగుతాయని భావిస్తున్నారు. ముహూర్తాలు దగ్గర పడుతుండటంతో మార్కెట్లకు కూడా పెళ్లి కళ వచ్చింది. ఇప్పటికే ఇళ్ల మరమ్మతుల కోసం సిమెంట్ పనులు, ఇళ్లకు రంగులు తదితర అలంకరణ పనులు ఊపందుకుంటున్నాయి. సరికొత్త శ్రేణి ఆభరణాలతో బంగారం షాపులు రెడీ అవుతున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల షాపులు, పాదరక్షల షాపులు, పెళ్లి శుభలేఖల షాపులు సిద్ధమయ్యాయి. చాలా చోట్ల కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, బాంక్వెట్ హాళ్ల అడ్వాన్సు బుకింగ్‌లు అవుతున్నాయి. మే వరకూ శుభ ముహూర్తాలు.. నాలుగు నెలల తర్వాత మంచి బలమైన ముహూర్తాలు వస్తున్నందున పెళ్లి బాజాలు మోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూఢం లో వివాహాలు జరిపించరు. మూఢం వెళ్లగానే మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేస్తారు. ప్రస్తుత శుభకృత్ నామ సంవత్సరం తర్వాత వచ్చే శోభకృత్ నామ సంవత్సరం 2023 మే నెల వరకు శుభలగ్నాలు ఉన్నాయి. 2023 ఉగాది అయ్యాక చైత్రం, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో మంచి ముహూర్తాల్లో వివాహాలు జరిపిస్తారు. మొత్తంగా ఈ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు దాదాపు 42 ముహూర్తాలు ఉన్నాయి. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు(లాలూ), పురోహితుడు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
ఉగాది 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
డొల్లు కర్తరీ ప్రారంభం: 04–05–2022, రా.12:04లకు అనగా (05/05) శుభకృత్‌నామ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం మృగశిరా నక్షత్రం రోజున రవి భరణి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశించడంతో డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం: 11–05–2022, రా.10:04లకు శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి బుధవారం ఉత్తరఫల్గుణీ నక్షత్రం రోజున రవి కృత్తికలో ప్రథమపాదంలో ప్రవేశించడంతో పెద్దకర్తరీ ప్రారంభం అవుతుంది. ‘మృద్దారు శిలాగృహకర్మాణి వర్జయేత్’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించడానికి కర్తరీకాలం సరైనది కాదు. పై సూత్రం ఆధారంగా దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంఖుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. కర్తరీ పూర్తి (త్యాగం): 29–05–2022, ఉ.7:37లకు వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం కృత్తికా నక్షత్రం రోజున రవి రోహిణి నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించడంతో కర్తరీకాలం పూర్తవుతుంది. మూఢమి వివరములు శుక్ర మూఢమి: (15–09–2022 నుంచి 1–12–2022 వరకు) మూఢమి ప్రారంభం: 15–9–2022 శుభకృత్ నామ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం రోజున శుక్రుడు రవి నుండి ప్రాగస్తం (అనగా తూర్పుదిశగా అస్తమించడం వలన) మూఢమి ప్రారంభం అయినది. మూఢమి అంత్యం: 1–12–2022 మార్గశిర శుద్ధ అష్టమి రోజున శుక్రుడు రవి నుండి పశ్చాదుదయం (అనగా పశ్చిమ దిశగా ఉదయించడం) వలన మూఢమి పూర్తవుతుంది. నోట్: మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహాలకు వృద్ధత్వం అని పేరు. మూఢమి తరువాత బాలత్వం అని పేరు. ఆ రోజులలో శుభకార్యములు చేయరాదు. మకర సంక్రాంతి పురుష లక్షణమ్: 14–01–2023, రా.గం.2:14లకు (ఘ.49–01) స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్య మాసం బహుళ సప్తమి తత్కాల అష్టమి శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం చిత్తా నక్షత్రం రెండవ పాదం కన్యారాశి సుకర్మయోగం బాలవకరణం తులాలగ్నం సమయంలో రవి మకరరాశి ప్రవేశం. సూ.ఉ.6:38. సూ.అ.5:40. దినప్రమాణం 27:36. -
Subha Muhurtham: మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి..
వీధి మధ్యలో పెళ్లి మండపం తీర్చిదిద్ది ఎన్నాళ్లయ్యిందో. వివాహ ఊరేగింపులో మనసారా గంతులేసి ఎన్ని రోజులైందో. పెళ్లింటిలో మేకప్ వేసుకున్న ముఖాన్ని ధైర్యంగా చూపించి రెండేళ్లు గడిచిపోయింది. భయం లేకుండా విందు భోజనం ఆరారా తిన్న సంగతి కూడా గుర్తు లేకుండా పోయింది. రెండేళ్ల పాటు కరోనా అన్ని ఆనందాలను దూరం చేసింది. ఇప్పుడు కోవిడ్ కేసులతో పాటు భయం కూడా కొద్దికొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో కల్యాణ ఘడియలు ఫిబ్రవరి 2 నుంచి మొదలుకానున్నాయి. ఈ శుభ ముహూర్తాలపై సప్లయర్స్, బ్యాండు, వంటల నిర్వాహకులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాదైనా తమకు పూర్వ వైభవం వస్తుందని ఆశ పడుతున్నారు. సాక్షి, రాజాం, ఇచ్ఛాపురం రూరల్: రెండేళ్లు కోవిడ్ భయంతో గడిచిపోయాయి. నిబంధనల మధ్య వేడుకలు, కొద్ది మంది అతిథులతో పెళ్లిళ్లు, ఆర్భాటం లేని వివాహాలకు అంతా అలవాటు పడ్డారు. ఈ తరహా వేడుకలతో బ్యాండు మేళాలు, సప్లయర్స్ వారు భారీగా నష్టపోయారు. బతుకంతా పదిలంగా ఉండాల్సిన జ్ఞాపకాలను కూడా చాలామంది కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ కల్యాణ ఘడియలు వచ్చేశాయి. కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ కోవిడ్‌పై ప్రజలకు అవగాహన రావడంతో శుభ కార్యాలు కాసింత వేడుకగా నిర్వహించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. గత రెండేళ్లుగా నష్టాల బాటలో ఉన్న బ్యాండు పార్టీలు, సౌండ్ సప్లయర్స్ నిర్వాహకులు, వంట మేస్త్రీలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ రెండు నెలల్లోనే.. ఈ ఏడాది ప్రధానంగా ఏప్రిల్, జూన్ నెలల్లో అత్యధి క ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నటికీ ఈ నెలలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. అనంతరం గురు మూఢం రావడంతో తి రిగి మార్చి 18వ తేదీ వరకూ ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. మార్చిలో కేవలం ఆరు రోజులు మాత్ర మే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో అత్యధికంగా 14 రోజులు మంచి ముహూర్తాలు ఉండగా, మే నెలలో 11 రోజులు, జూన్ నెలలో 13 రో జులు చక్కటి ముహూర్తాలు ఉన్నాయి. జూలై నుంచి ఆషాఢం ప్రారంభమవుతుంది. ఆగస్టులో 10 రోజు లు, డిసెంబర్లో తొమ్మిది రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో శుక్ర మూఢం ప్రారంభమై అక్టోబర్, నవంబర్ వరకూ కొనసాగుతుంది. దీంతో ఈ మూడు నెలల్లో ఎలాంటి ముహూర్తాలు లేవు. కోటి ఆశలు.. ఫిబ్రవరి నెలలో జిల్లాలో చాలా పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో ఈ నెలలో చాలా చోట్ల భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. దక్షిణ సన్నాయి మేళం కనీసం రూ.18 వేలు చెల్లిస్తేనే వచ్చే పరిస్థితి ఉంది. పెద్దపెద్ద బ్యాండ్ బాజాలు రూ. 60 వేలు దాటి వసూలు చేస్తున్నాయి. వంట మాస్టార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. సౌండ్ సప్లయర్స్, డీజేలకూ మంచి గిరాకీ ఉంది. గత రెండేళ్లుగా నష్టాలు చవిచూసిన వీరంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కల్యాణ మండపాలూ ఇప్పుడిప్పుడే ముస్తాబవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ముహూర్తాలివే.. ఫిబ్రవరి నెలలో 2, 3, 5, 6, 7, 10, 11, 17, 19 తేదీల్లో వందల సంఖ్యల్లో జిల్లాలో వివాహాలు జరుగనున్నాయి. ముఖ్యంగా 3, 5, 10, 11, 19 తేదీల్లో బలమైన ముహూర్తాలు కావడంతో వివాహాలు చేసేందుకు పెళ్లి వారు సమాయత్తమవుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లిళ్లతో పాటు ఉపనయనాలు చేసేందుకు మంచి ముహూర్తంగా పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరిలోనే.. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 20వ తేదీ వరకు మంచి ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత మూఢం కావడంతో ఉగాది వరకు మంచి శుభముహూర్తాలు లేవు. గత ఏడాది కోవిడ్–19తో చాలా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా పడ్డాయి. వేసవి కాలంలో జరగాల్సిన పెళ్లిళ్లు కార్తీక మాసంలో జరిగా యి. నూతన గృహప్రవేశాలు, ఇతర శుభకార్యా లు జరుపుకునేలా అంతా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సందడితో పూర్వ వైభవం రానుంది. – నారాయణపాడి, పురోహితుడు, ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం 4న వివాహం జరగనుంది గత ఏడాది జరగాల్సిన నా పెళ్లిని కరోనాతో వాయిదా వేసుకున్నాం. ఈ ఏడాది మళ్లీ థర్డ్‌వేవ్ ఉద్ధృతం కానుందని స్నేహితులు చెప్పడంతో ఫిబ్రవరి 4న నేను పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లిళ్లకు మైక్ అండ్ డీజేలను వివాహాలకు తీసుకువెళ్తున్నాను. 3, 5, 10, 11, 17 తేదీల్లో నాకు మంచి గిరాకీ ఉంది. – దున్న చిరంజీవి, పెళ్లి కుమారుడు, లైటింగ్ అండ్ సౌండింగ్ యజమాని, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం ఆర్డర్లు వస్తున్నాయి గత రెండేళ్లుగా ఎలాంటి బేరాలు లేవు. సప్లయర్స్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మా వద్ద పనిచేసిన సిబ్బందిని కూడా తీసేశాం. ఇప్పుడిప్పుడే అడ్వాన్స్ బుకింగ్‌లు వస్తున్నాయి. ఈ ఏడాది పెళ్లిళ్లు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కోవిడ్ కరుణిస్తే ఈ ఏడాది మాకు నష్టాలు తప్పే అవకాశం ఉంది. – మక్క శ్రీనివాసరావు, సప్లయర్స్ యజమాని, పెంట గ్రామం, జి.సిగడాం మండలం మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఎక్కువగా ఫిబ్రవరి నెలలో పెళ్లిళ్లకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్, జూన్ నెలల్లో కూడా అనుకూ ల రోజులు ఉన్నాయి. ఈ ఏడాది పెళ్లిల్లు, గృహ ప్రవేశాలు అధికంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – ఎం.శ్రీనివాసరావు శర్మ, సంతకవిటి మండలం -
నేటి నుంచి శ్రావణం.. శుభ ముహూర్తాలు ఈ రోజుల్లోనే
సాక్షి, అనంతపురం : మహిళలు అత్యంత ప్రీతికరంగా భావించే నోముల మాసం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. కోయిలమ్మ కుహు రాగాలతో స్వాగతం పలుకుతుండగా.. పాడి పంటలతో జిల్లా వాసులను సుసంపన్నం చేసేందుకు వర్ష రుతువూ రానే వచ్చేసింది. నోములకు, పేరంటాలకు ఈ మాసం సుప్రసిద్ధం. జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం వంటి చోట్ల ఆర్యవైశ్యులు వాసవీ మాతకు విశేష అలంకరణలు, పూజలు నిర్వహిస్తుంటారు. కరోనాకు ముందు టీటీడీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఏర్పాటు చేసేవారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది కూడా కొనసాగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రధాన పండుగలన్నీ ఈ మాసంలోనే ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకూ కొనసాగే శ్రావణ మాసంలో ప్రతి ఇల్లూ ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆధ్యాత్మిక కాంతులు వెలుగులీనుతాయి. ప్రధానంగా శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో భాజాభజంత్రీలు శ్రవణానందకరంగా మోగనున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో నాగుల చవితి, గరుడ పంచమి రాకతో ప్రధాన పండుగలు ఆరంభం కానున్నాయి. 14న లక్ష్మీవేంకటేశ్వర వ్రతం, 15న నారసింహ వ్రతం, 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణ పౌర్ణిమ, రాఖీ పర్వదినం, 24న వెంకయ్య స్వామి ఆరాధన, 23 నుంచి మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు, 30న కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 6న పొలాల అమావాస్యతో శ్రావణం ముగిసి భాద్రపదం ప్రవేశిస్తుంది. ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే కట్టుబాట్లు, నియమాలు ప్రతివారికీ తగిన వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని అందించేవిగా ఉంటాయి. ముఖ్యంగా పసుపు కుంకుమల వినియోగం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. ఈ నెల 11, 13, 15, 18, 20, 22, 25, 27, 31, వచ్చే నెల 1, 4, 5 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయి. – గరుడాద్రి సురేష్ శర్మ, వేద పండితులు వివాహాలకు, శుభాకార్యాలకు మంచి రోజులు.. ఈనెలలో 11, 12, 13, 14, 18, 19, 20, 25, 26, 27, సెప్టెంబర్ 1 తేదీలు పెళ్లిళ్లకు, ఇతర శుభాకార్యాలు జరుపుకోవడానికి మంచి రోజులు. గృహ నిర్మాణ పనులకు.. ఈనెలలో 11,15,18,20,23,25,27, సెప్టెంబర్ 1 తేదీలు గృహ నిర్మాణ పనులకు అనువైన రోజులు. గృహ ప్రవేశాలకు.. ఈనెలలో 15, 20, 27 తేదీలు గృహ ప్రవేశాలకు అనువైన రోజులు. -
హర్ దిన్ శుభ్హై.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్
పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, బంధువులతో సందళ్లు.. పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులు ఏకమవుతున్నారు. ఇదేంటి మూఢాల్లో పెళ్లిళ్లు ఏంటి అనుకుంటున్నారా..? అదంతా గతం ఇప్పుడు హర్ దిన్ శుభ్ హై ట్రెండ్ కొనసాగుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మూఢాల్లోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తన చిన్న నాటి ఫ్రెండ్ నటాషా దలాల్‌ను ముంబైలోని అలీబాగ్‌లో పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్ స్టార్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వైవా హర్ష, అక్షరల ఎంగేజ్మెంట్ కూడా ఈ నెల 11న జరిగింది. ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ముహూర్తాలు లేకున్నా మూఢాల్లోనూ లగ్గాలు పెట్టుకుంటున్నారు. తమకు అనుకూలమైన రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్నారు. ప్రతిరోజూ మంచి రోజే.. ముహూర్తంతో పనేముందని చెబుతున్నారు. గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించడం, ఆ తర్వాత లగ్గాలకు పర్మిషన్ ఇచ్చినా కొన్నే మంచి రోజులు ఉన్నాయి. మళ్లీ ఈ నెల 8 నుంచి మూఢాలు ప్రారంభం కావడం, మే 13 వరకు ముహుర్తాలు లేవని పూజారులు చెబుతుండడంతో అప్పటి వరకు ఆలస్యమవుతుందని చాలామంది మూఢాల్లోనూ పెండ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. హర్‌దిన్‌శుభ్‌హై అంటే ప్రతిరోజూ మంచిరోజే..! ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో బాగా ట్రెండ్ అవుతున్న స్లోగన్ ఇది. దీని పేరుతో సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. ఈ క్యాంపెయిన్ చేస్తోంది వెడ్డింగ్ ప్లానర్లు. మన దేశంలో మ్యారేజీల సీజన్లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నగలు, బట్టలు, ఫర్నీచర్ మొదలుకొని ఎన్నో కొనుగోళ్లు జరుగుతాయి. ఎన్నో రకాల ప్రొఫెషన్ల వాళ్లు ఉపాధి పొందుతుంటారు. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఫంక్షన్ హాళ్ల ఓనర్లు, క్యాటరింగ్, డీజే, బ్యాండ్, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రిషియన్లు.. ఇళా ఎన్నో రకాల వృత్తుల వాళ్లు పెళ్లిళ్ల సీజన్ పై ఆధారపడి బతుకుతారు. అయితే కరోనా కారణంగా గతేడాది లగ్గాల్లేక వీళ్లందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్‌లాక్‌లో వివాహాలకు పర్మిషన్ ఇచ్చినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే మూఢాలు వచ్చాయి. దీంతో వెడ్డింగ్ ప్లానర్లు కొత్త ట్రెండ్‌కు తెరదీశారు. హర్‌దిన్‌శుభ్‌హై కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. వివాహం చేసుకునేవాళ్లు, వాళ్ల తల్లిదండ్రులూ దీనికి ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో మూఢాల్లోనూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ముహూర్తాలు ఉండే రోజులతో పోలిస్తే మూఢాల టైమ్‌లో జరిగే పెళ్లిళ్ల సంఖ్య చాలా తక్కువే. అయితే ముహూర్తం కన్నా తమకు అనుకూలమైన సమయం ముఖ్యమని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మూఢాల్లో శుభకార్యాలు వద్దని చెబుతున్నా జనం వినడం లేదని కొందరు పూజారులూ చెబుతున్నారు. జనం ఆలోచనల్లో వచ్చిన మార్పే ఇందుకు కారణమంటున్నారు. -
సుముహూర్తం..మోగనున్న పెళ్లి బాజాలు
వికారాబాద్ అర్బన్ : అధిక జేష్ఠమాసం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దీంతో గత పది రోజులుగా పలు శుభకార్యాలు కొనసాగుతున్నా.. పెళ్లిళ్లకు అనువైన మూహూర్తాలు మాత్రం దొరకలేదు. ఈ నెల 27, 30వ తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. జూలై 15 నుంచి ఆషాఢ మాసం రానున్న నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవు. దీంతో జూలై మొదటి వారంలోనే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తీపి గుర్తుగా... మనిషి జీవితంలో ఒకే సారి చేసుకునే పండుగ పెళ్లి. ఈ మూడు ముళ్ల బంధం, తలంబ్రాల కోలాహలం, ఏడు అడుగల నడక.. వందేళ్ల తీపి గుర్తులుగా ఉండిపోవాలని వధూవరులు, తల్లిదండ్రులు ఆశిస్తారు. ఈ సంబరాన్ని ఎప్పుడైనా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఫొటోగ్రఫీ, వీడియోలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇటీవల కొందరు డ్రోన్ కెమెరాలతో పెళ్లి వేడుకలను చిత్రీకరిస్తున్నారు. గాలిలో తేలియాడుతూ అత్యంత క్వాలిటీగా ఫొటోలు, వీడియోలు తీస్తుండటంతో డ్రోన్ కెమెరాలకు ఆదరణ పెరిగింది. పెళ్లి మండపంలోనే రెండు, మూడు స్క్రీన్లు ఏర్పాటు చేసి పెళ్లి వేడుకను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లు పెద్దపెద్ద పట్టణాల్లో, ధనికుల పెళ్లి వేడుకల్లో కనిపించేవి. ఇప్పుడు వికారాబాద్, తాండూరు, పరిగి లాంటి చిన్నచిన్న పట్టణాల్లో సందడి చేస్తున్నాయి. మండపాలకు డిమాండ్... పెళ్లి వేడుకలను వైభవంగా చేయాలంటే పెళ్లి మండపాలను ఆశ్రయించాల్సిందే. అక్కడైతేనే అతిథులకు అన్ని రకాల సౌకర్యాలు, విశాలమైన స్థలం ఉంటుంది. ఇందుకోసం పెళ్లి పెద్దలు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. దీంతో పెళ్లి మండపాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ ఫంక్షన్ హాల్ దొరికే పరిస్థితి లేదు. దీంతో పాటు, డెకరేషన్, క్యాటరింగ్, వీడియో, ఫొటోగ్రాఫర్లను సైతం ముందుగానే బుక్ చూసుకోవాలి. శ్రావణమాసం, భక్తిమాసం... హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భా వించేది శ్రావణమాసం. ఈ మాసంలో అత్యధిక మంది భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, భజ నలు, దీక్షలు చేస్తారు. ఈ నెల మొత్తం చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటా రు. ఆగస్టు 14వ తేదీ నుంచి శ్రావణ మాసం రానుంది. ఆగస్టు మాసంలో దివ్య మైన మూహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. శ్రావణమాసం పండుగలకు, శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో పెళ్లిళ్ల వేడుకలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మంచి రోజులు.. గత నెల రోజులుగా శుభగడియల కోసం ఎదురు చూసిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి వేడుకలను జరిపించేందుకు రెడీ అవుతున్నారు. జూన్‌లో కొన్ని సుముహూర్తాలు ఉండటంతో నూతన గృహప్రవేశం, పిల్లలకు పుట్టు పంచలు వంటి కార్యక్రమాలు చేశారు. నేటి బుధవారంతో పాటు ఈ నెల 30వ తేదీన మంచి ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. జూలై మాసంలో 1, 5, 6, 7తేదీల్లో మంచి గడియలు ఉన్నాయని పురోహితుడు వైభవలక్ష్మి ఆలయ అర్చకుడు అంబదాస్ తెలిపారు. ఆగస్టు మాసంలో 15, 16, 17, 18, 19, 23, 24, 29, 30, 31వ తేదీల్లో, సెప్టెంబర్ 2, డిసెంబర్ 12, 14, 21, 22, 27, 28, 29, 30వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు చెప్పారు. తిరిగి 2019 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. -
మోగింది కల్యాణ వీణ
♦ మోగనున్న పెళ్లి బాజాలు ♦ ఈనెల 6నుంచి మహూర్తాలు ♦ ఒక్కటి కానున్న వేలాది జంటలు శుభ కార్యాలకు మంచి ఘడియలు రానే వచ్చాయి. మూడు నెలలుగా మంచి రోజులు లేక శుభ ముహుర్తాలన్ని ఆగిపోయాయి. శ్రావణమాసం రాకతో ఆగిన పెళ్లిళ్లు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకమంటు పాటల మోతలు మోగనున్నాయి. రెండు మనస్సులకు మూడు ముళ్ల బంధం వేసి...జీవితాంతం తోడుగా ఉంటామంటు.. ఏడడుగులు వేసి .. నవగ్రహాల చల్లని దీవెనలతో దాంపత్య జీవితాన్ని పండించుకోవాలని ఉవ్విళ్లూరే యువతీ, యువకులు ఎదురుచూసే మంచి ముహుర్తం రానే వచ్చేశాయి. ఆగస్టు 6 నుంచి శుభ ఘడియలు ప్రవేశించడం, నెలాంతం వరకు మాత్రమే ముహుర్తాలుండడంతో పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాల సందడి ఊపందుకోనున్నాయి. ఫంక్షణ్ హాళ్ల నుంచి, పోటో గ్రాఫర్ల వరకు బుక్ చేయడంలో పెళ్లి పెద్దలు నిమగ్నమయ్యారు. దీంతో శుభాకార్యాల నిర్వాహణ వ్యాపారాలు జోరందుకున్నాయి. - ఘట్కేసర్ టౌన్ శుభకార్యాల గడియలు ... పెళ్లిళ్లు కావలసిన యువతీ, యువకులు ఎదురు చూసే పెళ్లి ముహుర్తాలు మూడు నెలల అనంతరం ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానున్నండంతో ఆకాశమంత పందిరి భూదేవంత పీటలు వేసి అత్యంత వైభవంగా నిర్వహించే పెళ్లిళ్ల సందడికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన మంచి ఘడియాలు నెలాంత వరకే ఉన్నాయి. శ్రావణ మాసం ముగింపు అనంతరం వచ్చే అమవాస్యతో శూన్యమాసం ప్రారంభం అవుతుంది. శూన్యమాసంలో మంచి ముహుర్తాలు ఉండని కారణంగా ఆగస్టు నెలలోనే శుభకార్యాలన్ని నిర్వహించడానికి ఉద్యుక్తులవుతున్నారు. శ్రావణమాసం ఆగస్టు 3 నుంచి ప్రారంభంమై సెప్టెంబర్ 1 వరకున్న ఆగస్టు 6,7, 13, 18, 20, 21, 25, 26, 27 శుభాకార్యలకు అనువైన రోజులున్నాయి. అప్పటి వరకు పెళ్లి ఏర్పాట్లు, బంధువుల రాకతో ఇళ్లన్ని కిటకిటలాడనున్నాయి. శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదం పితృ దేవతలకు పిండ ప్రధానాలు చేయడంతో మంచి కార్యక్రమాలు జరగవు. అనంతరం కార్తీక, మార్గశిరం, ఆశ్వయుజ మాసాల్లో పెళ్లిళ్లకు మంచి సమయమైన దసరా పండుగ తర్వాతే మంచి ముహుర్తాలు రానున్నాయి. దీంతో శుభా కార్యాలకు తక్కువ సమయం ఉండడంతో పెళ్లి ఏర్పాట్లుకు ఇబ్బందులు తప్పవనిసిస్తోంది. అవకాశమున్న ముహుర్తాలకే పెళ్లిళ్లు జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. జోరందుకున్న వ్యాపారాలు.... పెళ్లి వేడుకలు శుభలేకలతో ప్రారంభం అవుతుంది. తమతమ ఆర్థిక స్థోమత, హోదాక తగ్గట్టుగా రూ. 10-100ల వరకు ఎంచుకుంటున్నారు. బాజ, బజంత్రీల కోలాహాలం తక్కువేమి కాదు. పెళ్లి తంతు నుంచి సాగనంపే వరకు రూ. 10వేల నుంచి లభిస్తోంది. నేటి రోజుల్లో ఆర్కెస్ట్రా ఏర్పాట్లు కూడ తప్పనిసరయింది. పెళ్లి కొనుగోళ్లలో మొదటి ప్రాధాన్యం బంగారం కాగ ఆనంతరం దుçస్తులదే. నేడు 10 గ్రాముల బంగారం రూ. 31,000లకు చేరుకుంది. వ«ధూవరుల దుస్తులతో పాటు బంధువులకు కానుకాలుగా ఇవ్వాల్సీ ఉంటుంది.lరూ. 20 వేల నుంచి లక్షల వరకు నేడు వెచ్చిస్తున్నారు. పెళ్లి తంతు ముగిసేది భోజనం కార్యక్రమంతోనే. విందు నిర్వాహణను నేడు ఎవరు లెక్కించడం లేదు. తక్కువలో తక్కువ లక్షను నుంచి లక్షల వరకు వ్యయం చేస్తున్నారు. ఇంటి ముందర టెంటు వేసి పెళ్లి చేసే పరిస్థితులు నేడు లేని కారణంగా మద్య, ఉన్నత వర్గాల ప్రజలు ఫంక్షన్ హాళ్లను ఎంచుకుంటున్నారు. ఏసీ సౌకర్యాలతో కూడ నేడు లభిస్తుండగా స్థాయి, సౌకర్యాలను బట్టి రూ. 50 వేల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. పురుహితుల దక్షణ కూడ అమాంతం పెరిగిపోయింది. పెళ్లి వారి ఆర్థిక స్థాయిని బట్టి వేలను దక్షిణగా స్వీకరిస్తున్నారు. హోదాను బట్టి రవాణ సౌకర్యం ఏర్పాట్లును కూడ భారీగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందస్తుగా కార్లు, బస్సులను బుకింగ్ చేసుకుంటున్నారు. పెళ్లి కల రావడానికి ముఖ్యమైంది పూల అలంకరణ. పెళ్లి వేడుకలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవడానికి పెద్ద ఎత్తున బంతి, చామంతి, మల్లు, విరజాజి, సన్నజాజి, కనకాంబరం, లిల్లీ తదితర పూజలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నారు. వధూవరుల వాహనం, మండపాలను అందమైన పూలతో అలంకరిస్తున్నారు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లకు ముందస్తుగా డబ్బులు చెల్లించి ఒప్పందం చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని పర్యవేక్షించే బాధ్యతను అప్పగిస్తున్నారు. -
'ముహూర్తం' దాటింది..
మంచి తరుణం కోసం మరో నాలుగు నెలలు ఓ వైపు పుష్కరాలు.. మరోవైపు శూన్య మాసాలు, 'అధిక'ఆషాఢాలు.. ఇక అన్నీ మూఢాలే. మంచి తరుణం కోసం మరో నాలుగు నెలలు ఆగక తప్పదు. బుధవారం నుంచి ఎటువంటి శుభకార్యాల జోలికి వెళ్లవద్దని వేదపండితులు సూచిస్తున్నారు. ఇక శుభకార్యాలు బంద్ బాజాభజంత్రీలకు బ్రేక్ రేపటి నుంచి మూఢాలు ఖమ్మం : శుభ ముహూర్తాలు ముగిశాయి. మరో నాలుగు నెలల దాకా వివాహ, శుభకార్యాలు లేనట్టే. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నూతన పనుల ప్రారంభోత్సవాలకు తెరపడినట్టే. సుమారు 21రోజుల పాటు (మే 22 నుంచి జూన్ 11వ తేదీ వరకు) మేళ తాళాలు.. బాజాభజంత్రీలు.. విద్యుత్ దీపాల అలంకరణలు.. బంధు మిత్రులు.. బంగారు ఆభరణాలు.. వస్త్రాల కొనుగోళ్లతో సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చప్పబడింది. 17వ తేదీ నుంచి నాలుగు నెలల పాటు ఇక శుభ కార్యాల జోలే ఉండదు. ముగిసిన ముహూర్తాలు ఈ నెల 17 నుంచి శుభముహూర్తాలు ఉండవు. మంగళవారం అమావాస్య, బుధవారం నుంచి నిజ ఆషాఢం ప్రవేశిస్తుంది. ఇది జులై 16వ తేదీ వరకు ఉంటుంది. మళ్లీ జులై 17 నుంచి అధిక ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత భాద్రపదమాసం, శూన్యమాసం, శుక్రమూఢమిలు వరుసగా వచ్చాయి. ఈ నెలల్లో శుభకార్యాలు తలపెట్టరు. దీనికితోడు గోదావరి పుష్కరాలు కూడా రావటంతో పుష్కరకాలంలో శుభకార్యాలు చేయకూడదు. పుష్కరాల సమయంలో పెద్దలకు తర్పణాలు వదలటం.. వాళ్ల పేరిట శివలింగాల ప్రతిష్ఠ వంటివి చేస్తారు కాబట్టి ఈ నాలుగు నెలలు శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు శూన్యమాసాలే ఉంటాయి. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల ముహూర్తాలు ఉండవు. ఇక ఈ నాలుగు నెలలు పెళ్లి మండపాలు మూగనోము పాటించాల్సిందే. కొత్తగా పెళ్లైన నవ వధువులు నెలరోజులు ఆషాఢమాసంలో పుట్టింటి వద్దనే ఉండటం సంప్రదాయం. మళ్లీ ఆశ్వయుజ మాసంలోనే... ఆశ్వయుజమాసం అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రవేశిస్తుంది. ఇది నెల రోజుల పాటు ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల వరకు ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు పుష్యమాసం రావటంతో ముహూర్తాలు ఉండవు. ఆ తరువాత ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మాగమాసం ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి శుభముహూర్తాలు పుష్కలంగా ఉంటాయని వేదపండితులు తెలిపారు. పుష్కరాలు ముగిసేవరకు వరుసగా మూఢాలు, శూన్యమాసాలు, అధిక ఆషాఢ మాసాలు రావటం వలన నాలుగు నెల ల పాటు ముహూర్తాలు లేవు. జులై 14 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయూల్లో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. - రామడుగు గురుప్రసాదాచార్యులు, వేదపండితులు