- మున్సిపల్ కార్యాలయం ముట్టడించిన వైఎస్సార్‌సీపీ నేతలు
- జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్
- అధికారులను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన
అక్రమ పింఛన్లు రద్దు చేయాలి
Published Fri, Feb 10 2017 12:20 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM
పిఠాపురం :
భర్తలు బతికి ఉండగా భార్యలను వితంతువులు చేసిన జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు కార్యకర్తలు లబ్ధిదారులు గురువారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు అర్హులైన లబ్ధిదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన నేతలు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ్మోహ¯ŒS వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డౌ¯ŒS, డౌ¯ŒS, జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి, అక్రమంగా ఇచ్చిన పింఛన్లు రద్దు చేయాలి, అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలి, అక్రమాలకు సహకరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో దిగి వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఎం.రామ్మోహ¯ŒS విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆందోళనకారులు సంతృప్తి చెందలేదు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలలోపు చర్యలు తీసుకోవాలంటూ నేతలు అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబు మాట్లాడుతూ అనధికార రాజ్యాంగేతర శక్తులైన జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో ఏకపక్షంగా అర్హతలు లేకుండా ఎంపిక చేసిన పింఛన్లలో నిబంధనలు పాటించని పింఛన్లను రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరణ ధ్రువీకరణ పత్రాలు బతికున్న వారికి ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లతో సంబంధం లేకుండా తెలుగుదేశం నేతలు ఇష్టారాజ్యంగా జాబితాలు తయారు చేయగా వాటిని కనీసం చూడకుండా అధికారులు పంపిణీ చేయడం వల్లే అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొజ్జా రామయ్య, కౌన్సిలర్ పచ్చిమళ్ల జ్యోతి, నేతలు ఆనాల సుదర్శన్, అరిగెల రామయ్య దొర, బోను దేవ, పచ్చిమళ్ల అప్పలరాజు, మైనార్టీ నేత మొహీద్దీన్, వజ్రపు వీరేష్, బొజ్జా అయలు తదితర నేతలు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement