విద్యుదాఘాతంతో రైతు మృతి
తుర్కపల్లి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన తుర్కపల్లి మండలం గంధమల్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పిట్టల అంజయ్య (55)ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పొలాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో మోటార్‌కు వెళ్లే విద్యుత్ వైర్లు అతడి కాలుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక రైతులు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.