నంగునూరు: నాటుసార తయారు చేస్తున్నారనే సమాచారంతో శనివారం దాడులు నిర్వహించి మహిళను తహసీల్దార్ ముందు బైండోవర్ చేశామని రాజగోపాల్‌పేట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. సీతరాంపల్లి తండాకు చెందిన లౌడ్య లక్ష్మి తన వ్యవసాయ బావి వద్ద సారా తయారు చేస్తోందనే సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో 30 లీటర్ల బెల్లం పాకం లభిచడంతో ఆమెను తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. సీఆర్‌పీ సెక్షన్ 110 కింద మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మహిళ బైండోవర్
Published Sat, Oct 1 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement
Advertisement