పెన్నాలో దూకి వివాహిత ఆత్మహత్య
పోతిరెడ్డిపాళెం(కోవూరు) : మండలంలోని పోతిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన బొజ్జ కవిత (26) పెన్నానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కవిత సోమవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎక్కడికి వెళ్లిందో తెలియక భర్త శ్రీకష్ణ పలు ప్రాంతాల్లో వెతికాడు. ఆచూకీ తెలియకపోవడంతో తెలిసిన వారి దగ్గర వాకబు చేశాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పోతిరెడ్డిపాళెం ఎంప్లాయీస్ కాలనీవద్ద పెన్నానదిలో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకట్రావ్ సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కవిత మతికి గల కారణాలు తెలియరాలేదు.
అప్పులబాధతో..
ఇందుకూరుపేట (విడవలూరు) : అప్పుల బాధతో ఇందుకూరుపేట మండలంలోని కొరుటూరు గ్రామానికి చెందిన షేక్ రంతుల్లా (45) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు..రంతుల్లా వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు. స్థోమతకు మించి అతను అప్పులు చేశాడు. ఈ క్రమంలో బాకీలు చెల్లించాలని అప్పులిచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. మంగళవారం ఇంట్లో కుటుంబసభ్యులు లేని సమయంలో రంతుల్లా ఉరి వేసుకుని మతిచెందాడు. మతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీస్‌లకు సమాచారంలేదు.