
మహిళ ఆత్మహత్యాయత్నం
పులివెందుల : సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లె గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోవరంగుంటపల్లె గ్రామానికి చెందిన రమాదేవి(28) తన భర్త మరణించడంతో హోటల్ పెట్టుకొని జీవనం సాగించేది. ఆమె దుకాణం ఎదురుగా ఆమె సమీప బంధువులు కూడా మరో హోటల్ నడిపేవారు. రమాదేవికి చెందిన హోటల్‌లో వ్యాపారం బాగా సాగుతుండటంతో కక్ష పెంచుకున్న ఆమె సమీప బంధువులు శుక్రవారం రాత్రి రమాదేవితోపాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన రమాదేవి శనివారం సాయంత్రం విషపు ద్రావణం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బంధువులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఇక్కడి వైద్యులు కడప రిమ్స్‌కు సిఫార్సు చేశారు.