వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘గొర్రిపూడి’ విద్యార్థినులు
Published Wed, Mar 8 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
కరప ( కాకినాడ రూరల్) :
కరప మండలం గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఇంటింటా అన్నమయ్య శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. కాకినాడలోని శ్రీ జ్యోతి నృత్య కళానికేత¯ŒSలో హైసూ్కల్ విద్యార్థినులు పాలాని సత్యశ్రీ, శిరీష, సంధ్య, మాలాశ్రీ, దేవి, జ్యోతి, అనూష, నందిని, వీరలక్ష్మి, రోహిత, సింధు, లక్ష్మీదుర్గ, దుర్గాదేవి, లక్ష్మీకుమారి, రాణి తదితర 105 మంది గతనెల 28వ తేదీన కాకినాడలో మూడు రకాల కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానంలో సంపాదించారు. జ్యోతి నృత్య అకాడమీ వ్యవస్థాపకురాలు మద్దనాల వీరవెంకట లక్ష్మీజ్యోతి, కోశాధికారి ఎం.ప్రసాద్‌లు మంగళవారం గొర్రిపూడి హైసూ్కల్‌కు వచ్చి సర్పంచ్ జల్దాని సుబ్బలక్ష్మి, ఏసు గంగాధర్, ఇ¯ŒSచార్జి హెచ్‌ఎం వెంకటరత్నంలు విద్యార్థులకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఇచ్చిన «సర్టిఫికెట్లను అందజేశారు.
Advertisement