వండర్ బుక్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీహిత
వండర్ బుక్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీహిత
Published Thu, Sep 8 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
కాకినాడ కల్చరల్ :
భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారి వక్కలంక శ్రీహిత.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్‌్డ్సలో చోటు సంపాదించింది. ఈమేరకు ఆమకు ఆ సంస్థల ప్రతినిధి అలమండ ప్రసాద్ గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అశోక్‌నగర్‌లోని శ్రీసాయిబాబా మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శ్రీహిత ఐదో సంవత్సరం నుంచీ నాట్యంలో శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రదర్శనలు ఇచ్చిందన్నారు. నాట్య శిక్షకురాలు శ్రీవాణి మాట్లాడుతూ శ్రీహిత పట్టుదలతో నాట్యరంగంలో రాణిస్తోందన్నారు. ఈ అవార్డు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని శ్రీహిత అన్నారు. కార్యక్రమంలో శ్రీహిత తల్లిదండ్రులు వక్కలంక వీరభద్రరావు, సత్యవాణి దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ వేదుల అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement