ఐఐటీటీఎంలో పర్యాటక దినోత్సవ వేడుకలు
ఐఐటీటీఎంలో పర్యాటక దినోత్సవ వేడుకలు
Published Wed, Sep 28 2016 1:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(వేదాయపాళెం): గొలగమూడి సమీపంలోని ఐఐటీటీఎంలో మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఈవెంట్ కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి వినోదన్ మాట్లాడారు. పర్యాటక రంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగ ఆవశ్యకతను తమిళనాడు ట్రావెల్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ కలైమా మణిబాలన్, తదితరులు వివరించారు. విజేతలకు బహుమతులను అందజేశారు.
Advertisement
Advertisement