
కనువిందుగా యంత్రపూజ
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని దుర్గగుడిపై జరుగుతున్న యంత్రపూజల్లో ఆదివారం ఆశ్లేషా బలి యంత్రపూజ జరిగింది.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని దుర్గగుడిపై జరుగుతున్న యంత్రపూజల్లో ఆదివారం ఆశ్లేషా బలి యంత్రపూజ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశ్లేషాబలి రూపాన్ని రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దిన అర్చకులు కరణం శరత్‌కుమార్, సుదర్శన కృష్ణ పూజలు నిర్వహించారు. ఆశ్లేషాబలి యంత్ర పూజలు నిర్వహించడం వల్ల శీఘ్ర వివాహం, సత్ సంతానంతో పాటు రాజ్యోద్యోగం, మనశాంతి, దీర్ఘ రోగాల నుంచి నివృత్తి, ఆర్థికపరమైన కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని అర్చకులు తెలిపారు. పూజల అనంతరం ఆశ్లేషాబలి యంత్రం చుట్టూ భక్తులు దీపాలు వెలిగించారు.