ఆరో రోజుకు చేరిన యంత్ర పూజలు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : కార్తీక మాసాన్ని పురష్కరించుకుని దుర్గగుడిపై నిర్వహిస్తున్న యంత్ర పూజలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆరో రోజు శనివారం నాడు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి వారి యంత్ర పూజలు నిర్వహించారు. కరణం శరత్‌కుమార్, సుదర్శన కృష్ణలు వివిధ రంగుల ముగ్గులతో స్వామి వారి రూపాన్ని తీర్చిదిద్దారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి మన పాపాలను దూరం చేసే స్వామియని, స్వామి వారి యంత్రాన్ని పూజిండచం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొంది కోరిన కోర్కెలు తీరుతాయని సుదర్శన కృష్ణ పేర్కొన్నారు. స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.