యువకుడి దారుణహత్య | youger murdes in cherukuru | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణహత్య

Published Sat, Feb 25 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

యువకుడి దారుణహత్య

యువకుడి దారుణహత్య

చెరుకూరు (రొద్దం) : మండల పరిధిలోని చెరుకూరు గ్రామ సమీపంలో మడకశిర - పెనుకొండ ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి గ్రామప్రజలంతా శివరాత్రి జాగారంలో ఉండగా 35 ఏళ్ల వయసున్న యువకుడి ముఖంపై బండరాళ్లతో మోది చంపేశారు. ఆపై గుర్తు పట్టడానికి లేకుండా పెట్రోల్‌ పోసి శవాన్ని తగలబెట్టారు. శనివారం గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న సీఐ వేంకటేశ్వర్లు, ఎస్‌ఐ మున్నీర్‌ఆహ్మద్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అనంతరం డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లతో పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గురైన వ్యక్తి ఆచూకీ, హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలు తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ, ఎస్‌ఐలు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement