- బీహార్ రాష్ట్ర వాసిగా అనుమానిస్తున్న రైల్వే పోలీసులు
రైలు ప్రమాదంలో యువకుడి మృతి
Published Wed, Jul 27 2016 11:46 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
మంచిర్యాల టౌన్ : గుర్తు తెలియని 20–25 ఏళ్ల వయసు గల యువకుడు బుధవారం తెల్లవారుజామున మంచిర్యాలలోని హమాలివాడ రైల్వే గేటుకు వంద మీటర్ల దూరంలో గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందాడు. మంచిర్యాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ జగన్ కథనం ప్రకారం... బెల్లంపల్లి నుంచి రామగుండం వైపు వెళ్తున్న రైల్లోనుంచి పడిపోయి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడి వద్ద సెల్‌ఫోన్ లభ్యమైంది. అందులోని అతడి సెల్ఫీ ఫొటో, సిమ్ నంబర్ 8757106563 ఆధారంగా బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడిగా భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై ఎరుపు రంగు బ్లూ కలర్ గీతలు గల ఫుల్‌హ్యాండ్స్ షర్టు, బ్లూ కలర్ జీన్స్, మెడలో సిల్వర్ కలర్ గొలుసు ఉందని హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement