బైక్ అదుపుతప్పి.. యువకుడి దుర్మరణం
Published Tue, Aug 16 2016 12:37 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
నేరడ (కురవి) : రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతిచెంది నట్లు కురవి ఎస్సై జె.రామకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం..ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రుద్రారం(గోపాలపట్నం) తాలూకాలోని అర్జునెల్లి గ్రామానికి చెందిన కోరెం నరేంద్ర(28) మానుకోట మండలంలోని జంగిలిగొండ వద్ద జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 14న(ఆదివారం) రాత్రి పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై జంగిలిగొండ నుంచి నేరడ గ్రామానికి వచ్చాడు. అక్కడి నుంచి కురవి వైపు వస్తుండగా, అతడి బైక్ అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న కాలువ గట్టుపై పడిపోయాడు. కణతకు తీవ్ర గాయమై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆ రోడ్డు మీదుగా వెళ్తున్నవారు గమనించి ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అయితే సకాలంలో చికిత్స అందక సంఘటనా స్థలంలోనే నరేంద్ర కన్నుమూశాడు. కురవి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మానుకోటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, నరేంద్ర పనిచేస్తున్న జేసీబీ యజమానికి సంఘటన గురించి తెలిపారు. మృ తదేహాన్ని సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement