రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం young man died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Published Mon, Sep 12 2016 8:24 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం - Sakshi

చౌటుప్పల్‌:
65వ నంబరు జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం మల్కాపురం శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మల్కాపురం గ్రామానికి చెందిన ఎస్‌కె.మున్నా(22), తోటకూరి నరేష్‌లు తుఫ్రాన్‌పేటలో వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. ఆదివారం రాత్రి బైకుపై తుఫ్రాన్‌పేట నుంచి మల్కాపురానికి వస్తుండగా, బైకును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో, తీవ్ర గాయాలపాలై మున్నా అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడ్డ నరేష్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మున్నా మృతదేహాన్ని చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ హరిబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement