
యాదగిరిగుట్టలో దారుణం
యాదగిరిగుట్ట(యాదాద్రి భువనగిరి జిల్లా): యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ప్రేమోన్మాది విషాదం రేపాడు. ప్రేమించలేదన్న కోపంతో యువతిని ఉన్మాది పొడిచి చంపాడు. స్థానికంగా నివసిస్తున్న గాయత్రి(22) అనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే కాలనీలో నివాసముంటున్న శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో పొడిచాడు. ఆరుసార్లు బలంగా కడుపులో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది.
ఘటన అనంతరం నిందితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. రేపు గాయత్రికి రేపు వివాహ నిశ్చితార్థం జరగనున్న నేపథ్యంలో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయత్రిని కొంత కాలంగా శ్రీకాంత్ వేధిస్తున్నాడని గాయత్రి బంధువులు వెల్లడించారు. తనను ప్రేమించలేదన్న అక్కసుతోనే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.