భార్య కోసం సెల్‌టవర్ ఎక్కాడు!
గుంటూరు: తన భార్యను కాపురానికి పంపనందుకుగానూ ఏకంగా సెల్ టవరెక్కాడో వ్యక్తి. సతీష్ అనే యువకుడు నాలుగు రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంతలో భార్య తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు.
దాంతో తన భార్యను కాపురానికి పంపాలంటూ సతీష్ నిరసనకు దిగాడు. ఈ క్రమంలో పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.