రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయిన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు.
హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయిన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు.
ఆయన ఈ మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి(నెల్లూరు), చిత్తూరు (కళత్తూరు నారాయణస్వామి), కడప (అమరనాథ్‌రెడ్డి)తో మంగళవారం విడివిడిగా ఫోన్‌లో మాట్లాడి జిల్లాల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. జనజీవనాన్ని వర్షాలు బాగా ఇబ్బంది పెట్టాయని, రహదారులు బాగా దెబ్బ తిన్నాయని జిల్లా అధ్యక్షులు వైఎస్ జగన్‌కు వివరించగా అప్రమత్తంగా ఉండాలని వారికి ఆయన సూచించారు.