
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
పులివెందుల: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని పర్యటనలో భాగంగా ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పాల్గొని వినతులు స్వీకరించారు.
కాగా, పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె పంచాయితీ పరిధిలో ఉన్న మొట్నూతలపల్లెకు చెందిన రైతు రాజశేఖర్ కుటుండాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పరామర్శించనున్నారు. అప్పుల బాధతాళలేక గతనెల 19 వ తేదీన పొలం వద్దనే ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంతోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని అరటిని సాగు చేశాడు. అయితే గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లలో నీరు అడుగంటిపోవడంతో అరటి చెట్లు ఎండిపోయాయి. దాదాపు రూ. 16 లక్షలు అప్పు ఎలా తీర్చాలో దిక్కు తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు.