విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ సాధన కోసం నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గుడివాడ అమర్నాథ్తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష విరమింపజేశారు. సోమవారం విశాఖపట్నం వచ్చిన వైఎస్ జగన్.. విమానాశ్రయం నుంచి నేరుగా కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అమర్నాథ్ను పరామర్శించారు. అనంతరం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వైఎస్ జగన్ వెంట వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
విశాఖకు రైల్వే జోన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అమర్‌నాథ్ చేస్తున్న నిరాహార దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు బలవంతంగా ఆయన్ను అంబులెన్స్‌లో విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి తరలించారు.
అమర్నాథ్తో దీక్ష విరమింపజేసిన వైఎస్ జగన్
Published Mon, Apr 18 2016 2:27 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement