కడప: కేసీ కాలువకు వెంటనే నీళ్లు విడుదలచేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. కడపలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు మాట్లాడారు. గత ఏడాది కూడా కడప-కర్నూలు కాలువకు నీళ్లు ఇవ్వలేదని, దాంతో ఆయకట్టు మొత్తం ఎండిపోయిందని చెప్పారు.
శ్రీశైలం రిజర్వాయర్‌లో 874 అడుగుల వరకూ నీటి మట్టం ఉంచి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేసీ కాలువకు నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీ కెనాల్‌కు నీళ్లు ఇవ్వకుండా తెలంగాణాకు నీళ్లు ఇస్తే సహించేది లేదని, ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.