బాబుకు తెలిసింది స్కాములే | YSRCP Leader Bhumana fire on Chandrababu | Sakshi
Sakshi News home page

బాబుకు తెలిసింది స్కాములే

Published Sun, Dec 25 2016 3:24 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

బాబుకు తెలిసింది స్కాములే - Sakshi

బాబుకు తెలిసింది స్కాములే

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్కాములు తప్ప స్కీములు (ప్రజా సంక్షేమ పథకాలు) తెలియవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు.  భూమన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమకు మొత్తం 175 సీట్లు వస్తాయని చెప్పుకొంటున్న చంద్రబాబుకు 17 సీట్లకంటే ఎక్కువ రానే రావని భూమన జోస్యం చెప్పారు. ప్రజలు టీడీపీకి ఓట్లు వేస్తారనుకోవడం చంద్రబాబు భ్రమేనని తేల్చిచెప్పారు. బాబు పాల్పడుతున్న కుటిల రాజకీయాలను సమర్థిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టే గతే బీజేపీకి కూడా పడుతుందని కరుణాకరరెడ్డి హెచ్చరించారు.

ఆత్మస్థైర్యం కోల్పోయి ఎమ్మెల్యేల కొనుగోలు
‘‘చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోయి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.  బ్లాక్‌ మనీతో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలంతా బ్లాక్‌ ఎమ్మెల్యేలే. మా పార్టీ(వైఎస్సార్‌సీపీ) ఎమ్మెల్యేలను బెదిరించి టీడీపీలో చేర్చుకుం టున్నారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను కూడా అలాగే చేర్చుకున్నారు. ’’ అని విమర్శించారు. ‘‘రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా స్పీకర్‌ అధికారాలను ఎన్నికల సంఘానికి(ఈసీ) ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement