వైఎస్సార్ సీపీ రాష్ట ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేజే కుమార్ సత్యవీడు జైలు నుంచి విడుదలయ్యారు.
చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ ఆయన కుటుంబసభ్యులు సురేష్, యువరాజ్ మంగళవారం సత్యవీడు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు ఫోన్లో పరామర్శించారు. కాగా ఎమ్మెల్సీని అడ్డుకున్నారంటూ దాఖలైన కేసులో కేజే కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి సత్యవేడు సబ్‌జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
ఈనెల 3న నగరిలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతికుమార్‌పై ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు అనుచరులు దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ముద్దుకృష్ణమనాయుడు ఫిర్యాదు చేశారంటూ పోలీసులు కేజే కుమార్‌ను, ఆయన తనయుడిని అరెస్టు చేశారు.