కడప: రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో శనివారం ఉదయం 5 గంటలకు కడప ఆర్టీసీ బస్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప నగర మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు నిత్యానందరెడ్డితో పాటు వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టుచేసి రిమ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.