చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
విశాఖ : తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన అగత్యం తనకు లేదని పాలకొండ ఎమ్మెల్యే కళావతి వ్యాఖ్యానించారు. పార్టీ మారతారన్న వార్తలను ఆమె సోమవారమిక్కడ ఖండించారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక ప్రజలను మోసగిస్తున్న టీడీపీలో తాను ఎందుకు చేరతానని కళావతి ప్రశ్నించారు.
తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నందుకే చంద్రబాబు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. పార్టీ మరుతున్నట్లు టీడీపీ నేతలు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై ఉన్న విశ్వాసంతోనే తమను ప్రజలు గెలిపించారన్నారు. పార్టీపై, వైఎస్ జగన్పై ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయనని ఎమ్మెల్యే కళావతి తెలిపారు.