నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై చర్యలు
నెల్లూరు (టౌన్): నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ శివరామ్‌ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడారు. నగర పరిధిలో డిపోకు రెండు కిలోమీటర్లు, ఇతర ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ వాహనాలను నిలపరాదని కోరారు. ప్రైవేట్ బస్సులకు కాంట్రాక్ట్ పర్మిట్ తీసుకొని స్టేజీ క్యారియర్‌గా ప్రత్యేక బుకింగ్‌లు పెట్టి టికెట్లను విక్రయించడం వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎంయూ నాయుకులు ఎమ్వీ రావు, లూక్సన్, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.