Illegal vehicles
-
నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై చర్యలు
నెల్లూరు (టౌన్): నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ శివరామ్ప్రసాద్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడారు. నగర పరిధిలో డిపోకు రెండు కిలోమీటర్లు, ఇతర ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ వాహనాలను నిలపరాదని కోరారు. ప్రైవేట్ బస్సులకు కాంట్రాక్ట్ పర్మిట్ తీసుకొని స్టేజీ క్యారియర్‌గా ప్రత్యేక బుకింగ్‌లు పెట్టి టికెట్లను విక్రయించడం వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంయూ నాయుకులు ఎమ్వీ రావు, లూక్సన్, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కుల భరతం పడతాం
ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి తిరుగుతున్న తెలంగాణ వాహనాలపై చర్యలు : ఎస్పీ చింతలపూడి : ప్రవేశ పన్ను కట్టకుండా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తున్న అక్రమ వాహనాలపై కొరడా ఝుళిపించడానికి జిల్లా ఎస్పీ భరత్ భూషణ్ సిద్ధమయ్యారు. ‘ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి ఏపీలోకి’ శీర్షికన శనివారం ‘సాక్షి’ దినపత్రిలో వచ్చిన కథనానికి ఎస్పీ తీవ్రంగా స్పందించారు. ఏపీలోకి వచ్చే గ్రానైట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. ట్యాక్స్ కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఉపేక్షించేది లేదన్నారు. ఏపీ చెక్ పోస్ట్‌లో ట్యాక్స్ కట్టకుండా దొడ్డి దారిన రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలపై ఇక నుంచి నిఘా పెడతామన్నారు. ఏఏ రూట్లలో ఈ వాహనాలు దారి మళ్లిస్తున్నారో విచారణ జరుపుతామన్నారు. అవసరం అయినచోట కొత్త చెక్ పోస్టులు ఏర్పాటు చేసేలా సంబంధిత రవాణా శాఖ, మైనింగ్ శాఖ అధికారులతో సంప్రదిస్తానని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తున్న భారీ గ్రానైట్ వాహనాల నుంచి ఎంట్రీ ట్యాక్స్ కట్టించాల్సిన బాధ్యత రవాణా శాఖదేనన్నారు. పోలీస్ అధికారులతో పాటు మిగిలిన డిపార్ట్మెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడంలో తీసుకోవలసిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎంట్రీ ట్యాక్స్ కట్టించడానికి అవసరమైతే రవాణా శాఖ అధికారులకు పోలీసులు కూడా సహకరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.