విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 109 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు | 109 graduate apprentice in Vikram Sarabhai Space Centre | Sakshi
Sakshi News home page

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 109 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు

Published Wed, Oct 19 2016 3:27 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

109 graduate apprentice in Vikram Sarabhai Space Centre

 ఇస్రో అనుబంధ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) 2016-17 శిక్షణా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ఇందులో భాగంగా పది విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనుంది.ఆయా వివరాలు..
 
 ఇంజనీరింగ్ విభాగాల వారీగా ఖాళీలు
 1.ఏరోనాటికల్/ఏరోస్పేస్-6
 2.కెమికల్-5    3.  సివిల్-4
 4.కంప్యూటర్ సైన్స్-12
 5.ఎలక్ట్రికల్-4    6. ఎలక్ట్రానిక్స్-30
 7.మెకానికల్-29    8. మెటలర్జీ-4
 9.ప్రొడక్షన్-5
 10.లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్-10 (ఈ విభాగం ఇంజనీరింగ్ కిందికి రాదు)
 
 విద్యార్హత
 ఇంజనీరింగ్ పోస్టులకు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ (నాలుగేళ్ల/మూడేళ్ల కోర్సు) ఉత్తీర్ణత. ఇందులో కనీసం 65 శాతం మార్కులు/6.84 సీజీపీఏ ఉండాలి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పోస్టులకు డిగ్రీతోపాటు ఫస్ట్ క్లాస్ బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్సులో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
 
 గమనిక: పైన పేర్కొన్న కోర్సుల్లో 2014 ఏప్రిల్ తర్వాత ఉత్తీర్ణులైనవారే దరఖాస్తు చేసేందుకు అర్హులు. (అప్రెంటీస్‌షిప్ చట్టం ప్రకారం.. 2014లో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు   2017 జూలై వరకు మాత్రమే అప్రెంటీస్‌షిప్ శిక్షణ తీసుకునేందుకు అర్హులు). ప్రభుత్వ/పబ్లిక్/ప్రైవేట్ రంగాల్లో సంబంధిత విభాగంలో ఏడాది కంటే ఎక్కువ పని అనుభవం గల వారు శిక్షణకు అనర్హులు.
 
 గరిష్ట వయోపరిమితి
 2016, నవంబర్ 5 నాటికి జనరల్ అభ్యర్థులకు 30 ఏళ్లు; ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు; పీడబ్ల్యూడీలకు 40 ఏళ్లు.       
 శిక్షణ కాలం: ఏడాది
 స్టైపెండ్: నెలకు రూ.5000.
 
 ఎంపిక విధానం
 బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (బీవోఏటీ-బోట్)-చెన్నై నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బీఈ/బీటెక్/బీఎల్‌ఐఎస్సీలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.  
 
 ఇంటర్వ్యూ తేదీలు
 1.అక్టోబర్ 22 (శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మెకానికల్, సివిల్, కెమికల్, ఏరోనాటికల్/ఏరోస్పేస్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగాల వారికి ఇంటర్వ్యూ జరుగుతుంది.
 2.నవంబర్ 5 (శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్, మెటలర్జీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాల వారికి ఇంటర్వ్యూ జరుగుతుంది.
 
 ఇంటర్వ్యూ వేదిక
 యూనస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పల్లిముక్కు, వడక్కేవిల పోస్టాఫీసు, కొల్లం జిల్లా, కేరళ.  
 
 దరఖాస్తు విధానం
  ఇంటర్య్యూకి హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హతల, అనుభవ ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి, ఇంటర్వ్యూ కేంద్రంలో సమర్పించాలి.
 వెబ్‌సైట్: www.sdcentre.org
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement