శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు రీ యూజబుల్ లాంచింగ్ వెహికల్-టెక్నికల్ డిమాన్‌స్ట్రేటర్(ఆర్‌ఎల్‌వీ-టీడీ) ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి 6 గంటల ముందు సోమవారం వేకువజామున ఒంటి గంటకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
సుమారు 12 టన్నుల బరువు కలిగిన ఆర్‌ఎల్‌వీ-టీడీని భూమికి 70 కిలోమీటర్లు ఎత్తుకు పంపించి రాకెట్‌కు అమర్చిన స్క్రామ్‌జెట్ విమానాన్ని తిరిగి అండమాన్ నికోబార్ దీవులకు 200 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలోకి దించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకురావడానికి దోహదపడుతుంది. కాగా, ఈ ప్రయోగానికి సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెరైక్టర్, ఆర్‌ఎల్‌వీ-టీడీ రూపకర్త డాక్టర్ శివన్ ఆదివారం చెంగాళమ్మను దర్శించుకున్నారు.
నేడు ఆర్‌ఎల్‌వీ-టీడీ ప్రయోగం
Published Mon, May 23 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM
Advertisement
Advertisement